DISCOMs : కరెంట్ చార్జీలు పెరగవ్!
ABN , Publish Date - Jan 29 , 2025 | 04:09 AM
రానున్న ఆర్థిక సంవత్సరంలో (2025 ఏప్రిల్ 1 నుంచి 2026 మార్చి 31 వరకు) కరెంట్ చార్జీలు పెంచవద్దని డిస్కమ్‌లు నిర్ణయించాయి. ఈ మేరకు 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను వార్షిక ఆదాయ అవసరాల (ఏఆర్‌ఆర్) పిటిషన్లను తెలంగాణ విద్యుత్
వచ్చే ఏడాది మార్చి వరకూ పాత రేట్లే
డిస్కమ్‌ల ఆదాయం రూ.45,697 కోట్లు.. లోటు రూ.20,151 కోట్లు
ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీతో లోటు భర్తీ
విద్యుత్ నియంత్రణ మండలికి డిస్కమ్‌ల వివరణ
హైదరాబాద్, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): రానున్న ఆర్థిక సంవత్సరంలో (2025 ఏప్రిల్ 1 నుంచి 2026 మార్చి 31 వరకు) కరెంట్ చార్జీలు పెంచవద్దని డిస్కమ్‌లు నిర్ణయించాయి. ఈ మేరకు 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను వార్షిక ఆదాయ అవసరాల (ఏఆర్‌ఆర్) పిటిషన్లను తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలిలో దాఖలు చేశాయి. కొత్త ఆర్థిక సంవత్సరంలో నిర్వహణ, జీతాలు తదితర వ్యయాలకు దక్షిణ డిస్కమ్ (ఎస్పీడీసీఎల్)కు రూ.46,035 కోట్లు, ఉత్తర డిస్కమ్‌కు (ఎన్పీడీసీఎల్) రూ.19,814 కోట్లు అవసరమని అంచనా వేశాయి. రెండింటికీ కలిపి రూ.65,849 కోట్ల నిధులు అవసరమవుతాయి. ప్రస్తుతం కొనసాగుతున్న విద్యుత్ ఛార్జీలతో దక్షిణ డిస్కమ్ రూ.36,220 కోట్లు, ఉత్తర డిస్కమ్ రూ.9421 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తాయని అంచనా. దీనికి ఓపెన్ యాక్సె్‌సలో కరెంట్ కొనుగోలు చేసే వినియోగదారుల నుంచి క్రాస్ సబ్సిడీ సర్‌ఛార్జీ(సీఎ్‌సఎస్), అదనపు సర్‌ఛార్జీ(ఏఎస్) రూపంలో రూ.56.71 కోట్లు అదనంగా లభిస్తాయని లెక్క కట్టారు. అంటే మొత్తం ఆదాయం రూ.45,697 కోట్లు సమకూరే అవకాశం ఉంది. అవసరాలకు అయ్యే వ్యయంతో పోల్చితే దక్షిణ డిస్కమ్ రూ.9758 కోట్ల లోటుతో ఉండగా... ఉత్తర డిస్కమ్ రూ.10,393 కోట్ల లోటుతో ఉంటుంది. మొత్తం లోటు రూ.20,151 కోట్లు. ఈ లోటును ప్రభుత్వం సబ్సిడీ రూపంలో భర్తీ చేయనున్నట్లు గుర్తు చేశాయి.
చార్జీల పెంపునకు అనుమతించని ప్రభుత్వం
రానున్న ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ చార్జీల పెంపునకు ఉత్తర/దక్షిణ డిస్కమ్‌లు అనుమతి కోరగా, రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది. లోటునంతా సబ్సిడీ రూపంలో భర్తీ చేస్తామని హామీ ఇచ్చింది. విద్యుత్ చట్టం ప్రకారం రానున్న ఆర్థిక సంవత్సరంలో ఏఆర్‌ఆర్, టారిఫ్ ప్రతిపాదనలను ఏటా నవంబరు 30వ తేదీలోగా ఈఆర్‌సీకి సమర్పించాలి. ఆర్థిక సంవత్సరం ప్రారంభం కావడానికి నాలుగు నెలల ముందు దాఖలు చేయాలి. దీనిపై ఈఆర్‌సీ ప్రకటన జారీ చేసి, అభిప్రాయాల సేకరణ జరిపి, బహిరంగ విచారణ అనంతరం టారిఫ్ ఉత్తర్వులు ఇస్తుంది. ఉత్తర/దక్షిణ డిస్కమ్‌ల నష్టాలు గత పదేళల్లో రూ.64227 కోట్లకు చేరాయి. లోపభూయిష్ట నిర్వహణ విధానాలకు తోడు, గత ప్రభుత్వ హయాంలో డిస్కమ్‌లు నిండా మునిగాయని ఆయా సంస్థల ఉద్యోగులు, కార్మికులు వాపోతుంటారు.
మరిన్ని తెలుగు వార్తల కోసం..
Also Read: మాఘ మాసంలోనే అత్యధిక వివాహాలు.. ఎందుకంటే..
Also Read: ఆ రోజు మహాకుంభమేళకు వెళ్తున్నారా.. ఈ వార్త మీ కోసమే..
Also Read: ఆప్‌కి మద్దతుగా అఖిలేష్ ఎన్నికల ప్రచారం
Also Read: నీ ఇంట్లో నుంచి అవార్డు ఇస్తున్నావా సంజయ్..!
Also Read:ఆర్చర్ జ్యోతి సురేఖకు ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఇవ్వాలి
Also Read: అమెరికాలో ఘనంగా గణతంత్ర వేడుకలు.. రాజ్యాంగం గొప్పతనాన్ని వివరించిన వక్తలు
Also Read: జగన్ నాడు నేడు.. అసలు రహస్యం చెప్పిన కేంద్రం
Also Read: బీజేపీ విజయం కోసం హస్తినకు చంద్రబాబు.. ఆ నియోజకవర్గాల్లో చక్రం తిప్పనున్న సీఎం
For Telangana News And Telugu News