Disability Rights: గ్రామ పంచాయతీలకు దివ్యాంగులను నామినేట్ చేయాలి
ABN , Publish Date - Feb 03 , 2025 | 05:09 AM
గ్రామ పంచాయతీ, మునిసిపాలిటీ పాలక మండలిలో దివ్యాంగులను నామినేట్ చేయాలని ప్రభుత్వాన్ని దివ్యాంగుల సంఘం కోరింది.

దివ్యాంగుల సంఘం వినతి
హైదరాబాద్, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీ, మునిసిపాలిటీ పాలక మండలిలో దివ్యాంగులను నామినేట్ చేయాలని ప్రభుత్వాన్ని దివ్యాంగుల సంఘం కోరింది. ఈమేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహే్‌షకుమార్ గౌడ్, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వీరయ్యలకు సంఘం ప్రతినిధులు వినతిపత్రం సమర్పించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రవ్యాప్తంగా 25,538 మంది దివ్యాంగులను నామినేట్ చేసి వారికి రాజకీయ నాయకత్వ అవకాశాలు కల్పించాలని అందులో కోరారు. ఛత్తీ్‌సగఢ్, రాజస్థాన్‌లలో దివ్యాంగులను స్థానికసంస్థలకు నామినేట్ చేస్తున్నట్టు వివరించారు.