Reservation: సీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి
ABN , Publish Date - Aug 26 , 2025 | 03:21 AM
బీసీలకు 42 శాతంరిజర్వేషన్లను చట్టబద్దంగా అమలు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా బీసీల ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని
లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం: ఆర్ కృష్ణయ్య
కవాడిగూడ, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): బీసీలకు 42ు రిజర్వేషన్లను చట్టబద్దంగా అమలు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా బీసీల ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రభుత్వం గత 19 నెలలుగా బీసీ రిజర్వేషన్ల పేరుతో బీసీలను మోసం చేస్తుందన్నారు. సోమవారం ఇందిరాపార్కువద్ద బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్షను ఆర్ కృష్ణయ్య చేపట్టారు. ఈ దీక్షకు ఎంపీ ఈటల రాజేందర్, మండలిలో విపక్ష నేత మధుసూదనాచారి, మాజీ మంత్రి శ్రీనివా్‌సగౌడ్ తదితరులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ బీసీలకు 42శాతం రిజర్వేషన్లు చట్టబద్ధంగా అమలు జరిగేలా ప్రభుత్వం వెంటనే ప్రణాళికలను సిద్ధం చేయాలన్నారు. లేనిపక్షంలో బీసీ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ బీజేపీ ఎల్లప్పుడూ బీసీ పక్షమేనని, 42శాతం రిజర్వేషన్లు చట్టబద్ధంగా అమలు జరిగేంతవరకు వెనక్కి తగ్గబోమన్నారు. ఈ కార్యక్రమంలో మధుసూదనాచారి, శ్రీనివాస్‌గౌడ్, వకుళాభరణం కృష్ణమోహన్ తదితరులు మాట్లాడారు. సత్యాగ్రహ దీక్ష చేపట్టిన ఆర్ కృష్ణయ్యకు పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ చైర్మన్ విజీఆర్ నారగోని నిమ్మరసం అందజేసి దీక్షను విరమింపజేశారు.
ఇవి కూడా చదవండి..
ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా రైతులకు హాని జరగనీయం.. అమెరికా టారిఫ్‌లపై మోదీ
ట్రంప్ టారిఫ్‌లపై పీఎంవో కీలక సమావేశం
For More National News