DAZN Hyderabad Investment: రూ.500 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్‌లో డాజన్ విస్తరణపై సీఎం హర్షం
ABN , Publish Date - Jul 20 , 2025 | 02:32 AM
తెలంగాణలో పెట్టుబడులు, యువతకు ఉద్యోగావకాశాలను కల్పించడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు..
హైదరాబాద్, జూలై 19 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో పెట్టుబడులు, యువతకు ఉద్యోగావకాశాలను కల్పించడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. యూకేకు చెందిన గ్లోబల్ స్పోర్ట్స్ స్ర్టీమింగ్ దిగ్గజం డాజన్ (ఈఅోూ) హైదరాబాద్‌లో తన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విస్తరణను చేపట్టి.. రూ.500 కోట్ల పెట్టుబడిని ప్రకటించడం పట్ల సీఎం హర్షం వ్యక్తం చేశారు. ఐటీ శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు దీనిని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ‘‘తెలంగాణలో పరిశ్రమల స్థాపనకు, ఐటీ రంగ అభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. డాజన్ వంటి అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్‌ను తమ కార్యకలాపాలకు ఎంచుకోవడం, తెలంగాణలో ఉన్న నైపుణ్యం కలిగిన మానవ వనరులు, స్థిరమైన విధానాలు, ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలకు నిదర్శనం’’ అని పేర్కొన్నారు. డాజన్ తన ఆపరేషన్ సెంటర్ ద్వారా వచ్చే మూడేళ్లలో రూ.500 కోట్ల భారీ పెట్టుబడితో విస్తరణ ప్రణాళికలను ప్రకటించింది. ఈ విస్తరణ ద్వారా 2026 చివరి నాటికి 3,000 మంది ఉద్యోగులను నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సంస్థ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో ‘‘తెలంగాణ రైజింగ్, హైదరాబాద్‌పై డాజన్ ఉంచిన నమ్మకానికి మా ప్రభుత్వం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హైదరాబాద్‌ను ఒక బలమైన ఐటీ, పరిశ్రమల హబ్‌గా మార్చడానికి మంత్రి శ్రీధర్ బాబు చేస్తున్న నిరంతర కృషి అభినందనీయం’’ అని సీఎం రేవంత్‌రెడ్డి ‘ఎక్స్’లో పోస్టు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్
నేను ఎవరికీ భయపడేది లేదు... బండి సంజయ్‌కి స్ట్రాంగ్ కౌంటర్
Read Latest Telangana News and National News