Share News

Crime: ఆస్తి పంపకాలతో తల్లి అంత్యక్రియలు ఆపేసిన కూతుళ్లు

ABN , Publish Date - Oct 16 , 2025 | 10:17 AM

సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్)లో దారుణం జరిగింది. ఆస్తి పంపకాలతో తల్లి అంత్యక్రియలు కూతుళ్లు ఆపేశారు. కొంతకాలంగా అక్కా, చెల్లెళ్ల మధ్య భూ వివాదం నడుస్తోంది. ఈ క్రమంలోనే తల్లి చనిపోగా ఏకంగా మూడు రోజులుగా తల్లి అంత్యక్రియలు ఆపేశారు.

Crime: ఆస్తి పంపకాలతో తల్లి అంత్యక్రియలు ఆపేసిన కూతుళ్లు
Daughters stop mother's funeral

సూర్యాపేట, అక్టోబర్ 16: గర్భస్థ నరకం అనుభవించి బిడ్డకు జన్మిస్తుంది తల్లి. బిడ్డ పుట్టినప్పటినుంచి పెద్ద అయ్యేదాకా పస్తులుండో, గంజి తాగో కంటికి రెప్పలా బిడ్డను చూసుకుంటుంది. రాత్రి పగలు లేకుండా, అర్ధ రాత్రిళ్లు వరకూ మెలకువతో ఉండి ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తూ, పెంచి పెద్దవాళ్ళను చేస్తుంది. అమ్మ ప్రేమకు మించిన ప్రేమ లేదు అనేది జగమెరిగిన సత్యం. తాను మరణిస్తానని తెలిసినా తీవ్ర నరకయాతన అనుభవించి బిడ్డకు జన్మనిస్తుంది. మమతానురాగాలను పంచుతూ.. యుక్త వయస్సు వచ్చేసరికి జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తుంది. కాలం మారుతున్నా కొద్దీ ప్రేమలు కరువయ్యాయి. కేవలం అవసరాలు మాత్రమే ప్రేమగా నటిస్తూ జీవించడం నేటి ఫ్యాషన్. తమ వ్యక్తిగత కోరికల కోసం ఎంతటి దారుణానికి అయినా పాల్పడుతున్నారు. తమకు కావలసింది దక్కేవరకు ఎంతటి దుస్సాహసానికైనా తెగిస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే తీవ్ర విస్మయానికి గురిచేస్తుంది.


తెలంగాణలో మానవత్వం మంటగలిసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్)లో దారుణం జరిగింది. ఆస్తి పంపకాలతో తల్లి అంత్యక్రియలు కూతుళ్లు ఆపేశారు. కొంతకాలంగా అక్కా, చెల్లెళ్ల మధ్య భూ వివాదం నడుస్తోంది. ఈ క్రమంలోనే తల్లి చనిపోగా ఏకంగా మూడు రోజులుగా తల్లి అంత్యక్రియలు ఆపేశారు. భూముల సమస్య కొలిక్కి వచ్చిన తర్వాతే అంత్యక్రియలు నిర్వహిస్తామని తేల్చి చెప్పారు. కన్న కూతుళ్లే ఇంతటి దారుణానికి ఒడిగ్గటంపై గ్రామస్తులంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కన్న పేగు బంధానికి ఇచ్చే విలువ ఇదేనా అని ద్రవించిన హృదయంతో ఆవేదన చెందుతున్నారు. అంత్య క్రియలు నిర్వహించి, ఆస్తులు పంచుకుంటే సరిపోయేదని, కన్న తల్లి దహన సంస్కారాలు ఆపేయడం సంస్కారం కాదని చర్చించుకుంటున్నారు.

Updated Date - Oct 16 , 2025 | 10:17 AM