వర్గీకరణపై త్వరలోనే చట్టం:దామోదర
ABN , Publish Date - Feb 26 , 2025 | 04:58 AM
ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఏక సభ్య కమిషన్ అద్భుతమైన నివేదిక ఇచ్చిందని, అందులో వంకలు పెట్టడానికి ఏమీ లేదని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.

మాదిగ అమరుల కుటుంబ సభ్యుల కాళ్లు కడిగిన మంత్రి
హైదరాబాద్/పంజాగుట్ట, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఏక సభ్య కమిషన్ అద్భుతమైన నివేదిక ఇచ్చిందని, అందులో వంకలు పెట్టడానికి ఏమీ లేదని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సుప్రీం కోర్టు తీర్పునకు అనుగుణంగా, అన్ని విధాలుగా అధ్యయనం చేసి.. అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా కమిషన్ నివేదిక ఇచ్చిందని పేర్కొన్నారు. రాజకీయం కోసం దీనిపై విమర్శలు చేయడం తగదన్నారు. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణపై త్వరలోనే చట్టం చేస్తామని వెల్లడించారు. ఆ తర్వాత పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీ కూడా చేపడతామని తెలిపారు.
ఎస్సీ వర్గీకరణ పోరాటంలో అమరులైన వారి సంస్మరణ సభ మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అధ్యక్షతన మంగళవారంబేగంపేటలోని టూరిజం ప్లాజాలో జరిగింది. తొలుత ఎస్సీ వర్గీకరణ పోరాటంలో అమరులైన పి.సురేందర్ మాదిగ, ఎన్. దామోదర్ మాదిగ, మహేష్ మాదిగ, భారతి మాదిగ, బి.ప్రభాకర్ మాదిగ, సీహెచ్. నాగేశ్వరరావు మాదిగ చిత్రపటాలకు నివాళులర్పించారు. అనంతరం మంత్రి రాజనర్సింహ.. అమరుల కుటుంబ సభ్యుల కాళ్లు కడిగి సన్మానించారు. ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్నీ అందించారు. ం ఉన్నా ఆదుకునే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందని పేర్కొన్నారు.