Share News

Dakshin Express Incident: ఘట్‌కేసర్‌లో దారుణం.. ఇద్దరు అన్నదమ్ముల్ని రైల్లోంచి తోసేసిన ప్రయాణికుడు

ABN , Publish Date - Oct 07 , 2025 | 08:19 PM

దక్షిణ్ ఎక్స్‌ప్రెస్‌లో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. తనతో పాటు ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఓ ప్రయాణికుడు రైలు నుంచి కిందకు తోసేశాడు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మరొకరు తీవ్ర గాయాలతో కోమాలోకి వెళ్లిపోయారు. ఘట్‌కేసర్ వద్ద ఈ దారుణం జరిగింది.

Dakshin Express Incident: ఘట్‌కేసర్‌లో దారుణం.. ఇద్దరు అన్నదమ్ముల్ని రైల్లోంచి తోసేసిన ప్రయాణికుడు
Ghatkesar Dakshin Express incident

ఇంటర్నెట్ డెస్క్: హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళుతున్న దక్షిణ ఎక్స్‌ప్రెస్‌లో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఇద్దరు అన్నదమ్ముల్ని తోటి ప్రయాణికుడు రైలు నుంచి కిందకు తోసేయడంతో ఒకరు మరణించగా మరొకరు కోమాలోకి వెళ్లిపోయారు. ఘట్‌కేసర్ వద్ద ఈ దారుణం జరిగింది. బాధితులను మధ్యప్రదేశ్‌కు చెందిన చంద్వాని సోదరులుగా పోలీసులు గుర్తించారు. అన్నకు 33 ఏళ్లు, తమ్ముడికి 30 ఏళ్లు అని చెప్పారు. వారి మధ్య ఘర్షణకు కారణం ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన తమ్ముడు అక్కడికక్కడే మృతి చెందగా అన్న కోమాలోకి వెళ్లిపోయాడు. ప్రస్తుతం అతడికి ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్సను అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న సికింద్రాబాద్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పీఎంఓ పేరిట మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్..!

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 07 , 2025 | 08:46 PM