CPI: జనాభా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు: సీపీఐ
ABN , Publish Date - Mar 01 , 2025 | 04:32 AM
బీసీల వెనుకబాటు తనం పోవాలంటే వారికి సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ప్రభుత్వాలు చేయూతనందించాల్సిన అవసరం ఉందని, ఇందుకు ఏకైక మార్గం జనాభా దామాషా ప్రకారం బీసీలకు చట్టసభలతో పాటు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): బీసీల వెనుకబాటు తనం పోవాలంటే వారికి సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ప్రభుత్వాలు చేయూతనందించాల్సిన అవసరం ఉందని, ఇందుకు ఏకైక మార్గం జనాభా దామాషా ప్రకారం బీసీలకు చట్టసభలతో పాటు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. ఇందు కోసం జరిగే ప్రతి పోరాటంలో సీపీఐ మద్దతు ఇస్తుందన్నారు. సీపీఐ కార్యాలయంలో శుక్రవారం ‘దేశ జనగణనలో కులగణన- బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు-జనాభా ప్రాతిపదికన స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు’ అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
దేశ వ్యాప్తంగా జనగణనతోపాటు కులగణన కూడా చేపట్టాలని బీసీ సంఘాల నేతలు, రాజకీయ నాయకులు, బీసీ మేథావులు డిమాండ్ చేశారు. సీపీఐ వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తుర్కయంజాల్ పరిధిలోని బ్రాహ్మణపల్లిలో శుక్రవారం బహిరంగ సభ జరిగింది. ముఖ్యఅతిథిగా కూనంనేని మాట్లాడుతూ సీపీఐ ఎల్లప్పుడూ పేదల పక్షాన ఉంటూ పోరాటం చేస్తుందన్నారు.