Share News

CPI: రజక, క్షౌర వృత్తిదారుల ఉచిత విద్యుత్‌ పెండింగ్‌ బిల్లులివ్వాలి

ABN , Publish Date - Jun 18 , 2025 | 04:24 AM

రజకులు, క్షౌర వృత్తిదారుల ఉచిత విద్యుత్‌ పథకం పెండింగ్‌ బిల్లులు ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు.

CPI: రజక, క్షౌర వృత్తిదారుల ఉచిత విద్యుత్‌ పెండింగ్‌ బిల్లులివ్వాలి

  • సమస్యలను సర్కారు దృష్టికి తీసుకెళ్తాం

  • సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని, ఎమ్మెల్సీ కోదండరాం హామీ

కవాడిగూడ, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): రజకులు, క్షౌర వృత్తిదారుల ఉచిత విద్యుత్‌ పథకం పెండింగ్‌ బిల్లులు ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. రజకులు, క్షౌర వృత్తిదారుల సమస్యలను సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి తమవంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రజక, క్షౌర వృత్తిదారుల ఉచిత విద్యుత్‌ పథకం పెండింగ్‌ బిల్లులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం ఇందిరా పార్క్‌లోని ధర్నా చౌక్‌ వద్ద మహా ధర్నా జరిగింది.


ఈ కార్యక్రమంలో కూనంనేని సాంబశివరావు, కోదండరాం, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌ మాట్లాడుతూ.. జీవో నంబర్‌.2 ద్వారా 250 యూనిట్ల ఉచిత విద్యుత్‌ పథకంలో 1,12,586 మంది రజక, క్షౌర వృత్తిదారులు ఉపాధి పొందుతున్నారని, కానీ, గత ఏడాదిన్నరగా ఈ పథకం బిల్లులు విడుదల కాక వారు ఇబ్బందుల పాలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై రాబోయే అసెంబ్లీ, శాసనమండలి సమావేశాల్లో ప్రత్యేక చొరవ తీసుకుని ప్రభుత్వంతో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

Updated Date - Jun 18 , 2025 | 04:24 AM