Share News

Phone Threat: మాగంటి గోపీనాథ్‌ తర్వాత నువ్వే..

ABN , Publish Date - Jun 23 , 2025 | 04:46 AM

ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ మీద ఏదైతే చేసినానో.. నీ మీద కూడా అలాంటిదే మొదలు పెట్టిన... 15 రోజుల్లో నీవు శ్మశానానికి వెళ్లడం పక్కా...

Phone Threat: మాగంటి గోపీనాథ్‌ తర్వాత నువ్వే..

  • నీ అంతు చూసేందుకు ఇప్పటికే పూజలు మొదలు పెట్టాను

  • బీఆర్‌ఎస్‌ నేతకు ఓ కన్వెన్షన్‌ నిర్వాహకుడి బెదిరింపులు!

బంజారాహిల్స్‌, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): ‘‘ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ మీద ఏదైతే చేసినానో.. నీ మీద కూడా అలాంటిదే మొదలు పెట్టిన... 15 రోజుల్లో నీవు శ్మశానానికి వెళ్లడం పక్కా...’’ అంటూ ఓ కన్వెన్షన్‌ నిర్వాహకుడు, వివాదాస్పద రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి బీఆర్‌ఎస్‌ నేత ఒకరిని ఫోన్‌లో బెదిరించిన ఆడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో నివసించే ఆ బీఆర్‌ఎస్‌ నాయకుడికి సదరు కన్వెన్షన్‌ నిర్వాహకుడు ఫోన్‌ చేసి ‘‘ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌పై చేసిన పూజలే నీపై మొదలు పెట్టిన...


శుక్రవారం పూజ మొదలైంది. 15 రోజుల్లో నువ్వు శ్మశానానికి వెళ్లడం ఖాయం’’ అంటూ బెదిరించాడు. ‘‘నాకే ఎదురు వస్తావా.. రూ.100 కోట్లు ఖర్చు అయినా సరే... నీ అంతు చూసే వరకు వదలను.. నీ కుటుంబాన్ని రోడ్డు మీదకు ఈడుస్తా..’’ అంటూ తీవ్రస్థాయిలో బెదిరించడంతోపాటు దుర్భాషలాడాడు. వైరల్‌గా మారిన ఈ ఆడియో చర్చనీయాంశంగా మారింది.

Updated Date - Jun 23 , 2025 | 04:46 AM