Hanumanth Rao: కిషన్ రెడ్డి, బండి సంజయ్ సాధించింది సున్నా
ABN , Publish Date - Feb 03 , 2025 | 04:59 AM
కేంద్ర మంత్రివర్గంలో తెలంగాణకు చెందిన కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఉండి సాధించింది సున్నా అని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు మండిపడ్డారు.

కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి) : కేంద్ర మంత్రివర్గంలో తెలంగాణకు చెందిన కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఉండి సాధించింది సున్నా అని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందన్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో ఆదివారం మాట్లాడారు. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలపై కేంద్రం పక్షపాత ధోరణిని చూపిస్తోందన్నారు. విభజన హామీలను నెరవేర్చలేదని, మూసీ ప్రక్షాళనకు నిధులడిగినా ఇవ్వలేదని చెప్పారు.
యూపీయే హయాంలో అందరినీ సమానంగా చూసేవాళ్లమని గుర్తుచేశారు. బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయంపై ఆందోళనలు చేపడతామని తెలిపారు. ఇందిరమ్మ పేరు పెడితే ఇళ్లకు నిధులు ఇవ్వమని కేంద్ర సహాయ మంత్రి అంటున్నారని, అది ఈనాటి పథకం కాదనే విషయం ఆయనకు తెలియదేమోనని ఎద్దేవా చేశారు.