Share News

MLA Quota: మజ్లిస్‌ ఎటు!?

ABN , Publish Date - Mar 05 , 2025 | 02:46 AM

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ పోలింగ్‌ వరకూ వెళుతుందా!? కాంగ్రెస్‌, బీఆర్‌ఎ్‌సలు తమకున్న ఎమ్మెల్యేల సంఖ్యాబలానికే పరిమితమై ఏకగ్రీవం చేసుకుంటాయా!? ఈ ఎన్నికల్లో ఎంఐఎం పాత్రేంటి? ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం జోరుగా జరుగుతున్న చర్చ ఇది.

MLA Quota: మజ్లిస్‌ ఎటు!?

సిటింగ్‌ సీటును తమకే ఇవ్వాలంటూ

కాంగ్రెస్‌ను కోరుతున్న ఎంఐఎం

స్థానికంలో మద్దతిస్తామంటున్న హస్తం

రెండో అభ్యర్థిని దించాలని బీఆర్‌ఎస్‌ ప్లాన్‌

సిటింగ్‌ సీటుకు మద్దతుపై మజ్లి్‌సకు ఆఫర్‌

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై ఉత్కంఠ

హైదరాబాద్‌, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ పోలింగ్‌ వరకూ వెళుతుందా!? కాంగ్రెస్‌, బీఆర్‌ఎ్‌సలు తమకున్న ఎమ్మెల్యేల సంఖ్యాబలానికే పరిమితమై ఏకగ్రీవం చేసుకుంటాయా!? ఈ ఎన్నికల్లో ఎంఐఎం పాత్రేంటి? ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం జోరుగా జరుగుతున్న చర్చ ఇది. ప్రస్తుతం ఐదు స్థానాలకు ఎన్నికలు జరగనుండగా.. వాటిలో 4 బీఆర్‌ఎస్‌ సిటింగ్‌ సీట్లు కాగా.. ఒకటి మజ్లిస్‌ సిటింగ్‌ సీటు. ఎన్నికల ప్రక్రియలో 119 మంది ఎమ్మెల్యేలూ ఓటింగ్‌లో పాల్గొంటే.. బీఆర్‌ఎ్‌సకు నికరంగా ఉన్న సంఖ్యాబలాన్ని బట్టి ఆ పార్టీకి వచ్చేది ఒక్క సీటే. ఎన్నికల ప్రక్రియలో ఎమ్మెల్యేలంతా పాల్పంచుకుంటే.. ఒక్కో సీటులో గెలుపునకు దాదాపు 20 మంది ఎమ్మెల్యేల బలం అవసరం. బీజేపీకి మంది ఎమ్మెల్యేలే ఉండడంతో అభ్యర్థిని నిలబెట్టేందుకు అవసరమైన సంఖ్యాబలం ఆ పార్టీకి లేదు. ఈ నేపథ్యంలో, ఎన్నికల ప్రక్రియకు బీజేపీ దూరంగా ఉంటే.. ఓట్ల లెక్కింపు సూత్రం ప్రకారం ఒక్కో అభ్యర్థి గెలవడానికి 19 ఓట్లు సరిపోతాయి. అంటే, బీఆర్‌ఎస్‌ టికెట్‌పై గెలిచిన 38 మంది ఎమ్మెల్యేలూ ఆ పార్టీలోనే ఉంటే కచ్చితంగా రెండు సీట్లు దక్కి ఉండేవి. కానీ, పది మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ గూటికి చేరుకున్న నేపథ్యంలో ఆ పార్టీకి ప్రస్తుతం నికరంగా 28 మంది ఎమ్మెల్యేల బలమే ఉంది.


తద్వారా, ఒక అభ్యర్థిని గెలిపించుకున్న తర్వాత 9 ఓట్లు మిగిలి ఉంటాయి. అయితే, గతంలో బీఆర్‌ఎస్‌ సహకారంతోనే సీటును దక్కించుకున్న మజ్లిస్‌.. సిటింగ్‌ సీటును కాపాడుకునేందుకు ప్రస్తుతం అధికార కాంగ్రెస్‌ పార్టీ సహకారం కోరుతోంది. అయితే, ఎమ్మెల్సీ సీట్ల కోసం కాంగ్రెస్‌ నేతల నుంచి తీవ్ర ఒత్తిడి ఉన్న నేపథ్యంలో.. ఈ ఎన్నికల్లో తమకు సహకరించాలని, హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము సహకరిస్తామని మజ్లిస్‌ నేతలకు కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకత్వం ప్రతిపాదిస్తోంది. ఈ నేపథ్యంలోనే, సిటింగ్‌ సీటును మజ్లి్‌సకే ఆఫర్‌ చేసి.. కాంగ్రెస్‌ గూటికి చేరిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల్లో కొంతమందిని తిరిగి తమ వైపునకు తిప్పుకొని రెండో సీటునూ దక్కించుకోవాలని బీఆర్‌ఎస్‌ పావులు కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కానీ, అధికార పార్టీతో సఖ్యతను వదిలేసుకుని ప్రతిపక్ష బీఆర్‌ఎ్‌సతో మజ్లిస్‌ చేతులు కలపడం ప్రశ్నార్థకమేనని అంటున్నారు. సీపీఐతో కలిసి సభలో ప్రస్తుతం అధికార కాంగ్రెస్‌ పార్టీకి 66 మంది సభ్యుల బలం ఉంది. బీఆర్‌ఎస్‌ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలతో కలిసి ఇది 76కు చేరుకుంటుంది. సిటింగ్‌ సీటును తమకే కేటాయించాలన్న డిమాండ్‌ను పక్కన పెట్టి మజ్లిస్‌ సహకరిస్తే కాంగ్రె్‌సకు మద్దతుదారులైన ఎమ్మెల్యేల సంఖ్య 83కు చేరుకుంటుంది. అప్పుడు బీజేపీ ఓటింగ్‌లో పాల్గొన్నా.. పాల్గొనకపోయినా కాంగ్రెస్‌ నాలుగు సీట్లు గెలుచుకుంటుంది. అయితే, మజ్లి్‌సకు సీటు ఆఫర్‌ చేసి.. కాంగ్రె్‌సలో చేరిన తమ ఎమ్మెల్యేల్లో కొందరిని తిరిగి ఆకర్షించి కాంగ్రెస్‌ నాలుగో అభ్యర్థిని ఓడించాలని బీఆర్‌ఎస్‌ పావులు కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. రహస్య బ్యాలెట్‌ ఓటింగ్‌ నేపథ్యంలో క్రాస్‌ ఓటింగ్‌ జరిగినా అనర్హత వేటు పడే అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలో, ఎన్నికల్లో బీజేపీ, మజ్లిస్‌, తిరుగుబాటు ఎమ్మెల్యేల పాత్ర కీలకంగా మారనుంది.


ఇవి కూడా చదవండి

PM Modi: సింహం పిల్లలకు మోదీ ఫీడింగ్.. వీడియో వైరల్

Aurangazeb Row: ఔరంగజేబు వ్యాఖ్యల వివాదంపై అబూ అజ్మి క్షమాపణ

Bihar: అసెంబ్లీ ఎన్నికల వేళ.. మళ్లీ ఆయనకే బీజేపీ అధ్యక్ష పగ్గాలు

Bird flu: బర్డ్‌ఫ్లూపై కలెక్టర్ ఏమన్నారంటే..

Akhilesh Yadav: మనుషులా? మరబొమ్మలా?.. వారానికి 90 గంటల పనిపై అఖిలేష్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 05 , 2025 | 02:46 AM