Government Land Dispute: వెస్టర్న్ విండ్సర్ నిర్మాణాలపై లోకాయుక్తకు ఫిర్యాదు
ABN , Publish Date - Aug 01 , 2025 | 03:53 AM
ప్రభుత్వ భూముల్లో మాజీ ఎంపీ రంజిత్‌రెడ్డికి చెందిన వెస్టర్న్ విండ్సర్ పార్కు ఎల్‌ఎల్‌పీ సంస్థ అక్రమంగా అనుమతులు
డీఎ్‌సఆర్ ఎస్‌ఎ్‌సఐ బిల్డర్స్, డెవలపర్స్‌పై కూడా..
హెచ్‌ఎండీఏ కమిషనర్, ప్లానింగ్ డైరెక్టర్-1కు లోకాయుక్త నోటీసులు
హైదరాబాద్, జూలై 31 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ భూముల్లో మాజీ ఎంపీ రంజిత్‌రెడ్డికి చెందిన వెస్టర్న్ విండ్సర్ పార్కు ఎల్‌ఎల్‌పీ సంస్థ అక్రమంగా అనుమతులు పొంది 41 అంతస్తుల భారీ నిర్మాణాలు చేపడుతోందని ఆరోపిస్తూ న్యాయవాది రామారావు లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. ఇందుకు హెచ్‌ఎండీఏ మాజీ కమిషనర్, ఐఏఎస్ అరవింద్‌కుమార్, హెచ్‌ఎండీఏ ప్లానింగ్ మాజీ డైరెక్టర్ -1 శివ బాలకృష్ణ అనుమతులు ఇచ్చారని తెలిపారు. రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలం పుప్పాలగూడలోని సర్వే 277, ఇతర నెంబర్లలోని దాదాపు 30 ఎకరాల ప్రభుత్వ భూముల్లో అక్రమంగా అనుమతులు పొందారని ఆరోపించారు. ఇవి ప్రభుత్వ భూములే అని 2019లో సుప్రీంకోర్టు సైతం తీర్పు ఇచ్చిందని పేర్కొన్నారు. ఈ భూములపై 26 సివిల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, అయినా నిర్మాణాలు చేపట్టడం అక్రమమని తెలిపారు. వాదనలు విన్న లోకాయుక్త విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని పేర్కొంటూ హెచ్‌ఎండీఏ కమిషనర్‌కు ఈ నెల 14న ఆదేశాలు జారీచేసింది. సెప్టెంబర్ 24 నాటికి పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించింది. అలాగే, పుప్పాలగూడలోని 278, 280, 281 తదితర సర్వే నెంబర్లలోని దాదాపు 30 ఎకరాల ప్రభుత్వ భూముల్లో డీ రఘురామిరెడ్డికి చెందిన డీఎ్‌సఆర్ ఎస్‌ఎ్‌సఐ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ సంస్థ అక్రమంగా అనుమతులు పొంది దాదాపు 30 అంతస్తుల భారీ నిర్మాణాలు చేపడుతోందని కూడా రామారావు ఫిర్యాదు చేశారు. దీనికి సైతం మాజీ హెచ్‌ఎండీఏ కమిషనర్, ఐఏఎస్ అర్వింద్‌కుమార్, మాజీ ప్లానింగ్ డైరెక్టర్ శివబాల కృష్ణ అనుమతులు ఇచ్చారని తెలిపారు. దీనిపై సెప్టెంబరు 24లోగా వివరణ ఇవ్వాలని హెచ్‌ఎండీఏ కమిషనర్, హెచ్‌ఎండీఏ ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్-1కు లోకాయుక్త ఆదేశాలు జారీచేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్ పర్యటన.. ప్రశాంతి రెడ్డి రియాక్షన్
జగన్ జైలుకు వెళ్తారా అంటే.. లోకేష్ ఏమన్నారంటే..
For More Telangana News And Telugu News