Share News

Kamakhya Devi Temple: కామాఖ్య దేవిపై వివాదాస్పద వ్యాఖ్యలు

ABN , Publish Date - Jun 02 , 2025 | 05:59 AM

అసోంలోని ప్రముఖ హిందూ దేవత అయిన కామాఖ్య దేవిపై ఎక్స్‌లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కోల్‌కతాకు చెందిన రషీది వజహత్‌పై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌కు ఫిర్యాదు అందింది.

Kamakhya Devi Temple: కామాఖ్య దేవిపై వివాదాస్పద వ్యాఖ్యలు

  • ఎక్స్‌లో పోస్టు చేసిన కోల్‌కతా వ్యక్తిపై ఫిర్యాదు

హైదరాబాద్‌, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): అసోంలోని ప్రముఖ హిందూ దేవత అయిన కామాఖ్య దేవిపై ఎక్స్‌లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కోల్‌కతాకు చెందిన రషీది వజహత్‌పై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌కు ఫిర్యాదు అందింది. తెలంగాణ బీజేపీ లీగల్‌ సెల్‌ న్యాయవాది కె.కరుణా సాగర్‌ ఈ ఫిర్యాదు చేశారు. కామాఖ్య దేవి ఫొటో పెట్టి అభ్యంతరకర భాషలో రషీది వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.


దీనిపై సోషల్‌ మీడియాలో విమర్శలు రావడంతో అతడు ఆ పోస్టును తర్వాత తొలగించాడు. ఆపరేషన్‌ సిందూర్‌కు సంబంధించి బాలీవుడ్‌ నటుల్లో కొందరు మౌనం వహించడంపై శర్మిష్ఠ పనోలీ చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదు చేసిన వారిలో ఈ రషీదీ కూడా ఉన్నాడని తెలిపారు. అతడిపై కేసు నమోదు చేయాలని కోరారు.

Updated Date - Jun 02 , 2025 | 05:59 AM