Share News

Rajgopal Reddy vs Revanth: పదేళ్లు నేనే సీఎంను అనడం కాంగ్రెస్‌ విధానాలకు వ్యతిరేకం

ABN , Publish Date - Jul 20 , 2025 | 02:36 AM

రాబోయే పదేళ్లు తెలంగాణకు తానే ముఖ్యమంత్రినంటూ సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించుకోవడాన్ని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే

Rajgopal Reddy vs Revanth: పదేళ్లు నేనే సీఎంను అనడం కాంగ్రెస్‌ విధానాలకు వ్యతిరేకం

  • నిఖార్సయిన కాంగ్రెస్‌ కార్యకర్తలు సహించరు

  • ‘ఎక్స్‌’లో ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్య

నల్లగొండ, జూలై 19 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): రాబోయే పదేళ్లు తెలంగాణకు తానే ముఖ్యమంత్రినంటూ సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించుకోవడాన్ని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తప్పుబట్టారు. రేవంత ప్రకటన కాంగ్రెస్‌ విధానాలకు వ్యతిరేకంగా ఉందన్నారు. ‘‘జాతీయ పార్టీ అయిన కాంగ్రె్‌సలో అధిష్ఠానం ఆదేశాల మేరకు, ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుంది. తెలంగాణ కాంగ్రె్‌సను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నిఖార్సయిన కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు సహించరు’’ అని ‘ఎక్స్‌’లో రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. దీంతోపాటు ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన ‘పదేళ్లు నేనే.!’ అనే క్లిప్లింగ్‌ను పోస్ట్‌ చేశారు. రాజగోపాల్‌రెడ్డి చేసిన ఈ వ్యాఖ్య రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్

నేను ఎవరికీ భయపడేది లేదు... బండి సంజయ్‌కి స్ట్రాంగ్ కౌంటర్

Read Latest Telangana News and National News

Updated Date - Jul 20 , 2025 | 02:36 AM