Share News

CM Revanth Reddy: 1,891 కోట్ల బకాయిలు చెల్లించండి

ABN , Publish Date - Mar 05 , 2025 | 03:08 AM

మంగళవారం ఢిల్లీలో కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రితోపాటు మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి కలిశారు. ప్రహ్లాద్‌ జోషి నివాసంలో ఉదయం, సాయంత్రం రెండుసార్లు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా 2014-15 వానాకాలం సీజన్‌లో భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)కు సరఫరా చేసిన బియ్యానికి సంబంధించి తెలంగాణకు రూ.1,468.94 కోట్లు రావాల్సి ఉందని ముఖ్యమంత్రి తెలిపారు.

CM Revanth Reddy: 1,891 కోట్ల బకాయిలు చెల్లించండి

సీఎంఆర్‌ డెలివరీ సమయం పొడిగించండి

4 వేల మెగావాట్ల సోలార్‌ విద్యుత్తు

ఉత్పత్తికి అనుమతులు పునరుద్ధరించండి

కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ జోషికి సీఎం రేవంత్‌రెడ్డి వినతి

మహిళా సమాఖ్యలకు బస్సులు

అద్దెకు ఆర్టీసీకి.. బస్సుపై నెలకు రూ.77,220 రాబడి

కొనుగోలుకు బ్యాంకు గ్యారంటీ ఇవ్వనున్న ప్రభుత్వం

ఈ నెల 8న తొలి విడతగా 150 బస్సుల ప్రారంభం

న్యూఢిల్లీ, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): పౌర సరఫరాల శాఖకు సంబంధించి తెలంగాణకు రావాల్సిన రూ.1,891 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని కేంద్ర ఆహార, పౌర సరఫరాలు, పునరుత్పాదక ఇంధన వనరుల శాఖల మంత్రి ప్రహ్లాద్‌ జోషిని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరారు. మంగళవారం ఢిల్లీలో కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రితోపాటు మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి కలిశారు. ప్రహ్లాద్‌ జోషి నివాసంలో ఉదయం, సాయంత్రం రెండుసార్లు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా 2014-15 వానాకాలం సీజన్‌లో భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)కు సరఫరా చేసిన బియ్యానికి సంబంధించి తెలంగాణకు రూ.1,468.94 కోట్లు రావాల్సి ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. పదేళ్లుగా ఇవి పెండింగ్‌లో ఉన్నాయని గుర్తు చేశారు. అప్పట్లో అదనపు లెవీ సేకరణకు సంబంధించిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించిందని చెప్పారు. ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన కింద 2021 మే నుంచి 2022 మార్చి వరకు సరఫరా చేసిన అదనపు బియ్యం, 2022 ఏప్రిల్‌లో సరఫరా చేసిన బియ్యానికి సంబంధించిన ఉత్తర్వులను ధ్రువీకరించుకుని రూ.343.27 కోట్లను విడుదల చేయాలని కోరారు. 2021 జూన్‌ నుంచి 2022 ఏప్రిల్‌ వరకు నాన్‌ నేషనల్‌ ఫుడ్‌ సెక్యూరిటీ యాక్ట్‌ (ఎన్‌ఎ్‌ఫఎ్‌సఏ) కింద పంపిణీ చేసిన బియ్యానికి రూ.79.09 కోట్ల బకాయిలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీంతోపాటు కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌) గడువును ప్రతినెలా కాకుండా కనీసం నాలుగు నెలలకు పొడిగించాలని కోరారు. అప్పుడే సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయని అన్నారు.


4 వేల మెగావాట్ల అనుమతిని పునరుద్ధరించండి

రాష్ట్రానికి పీఎం కుసుమ్‌ కింద గతంలో ఇచ్చిన 4 వేల మెగావాట్ల సోలార్‌ విద్యుత్తు ఉత్పత్తికి అనుమతులు పునరుద్ధరించాలని ప్రహ్లాద్‌ జోషికి సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణకు గతంలో 4 వేల మెగావాట్లకు అనుమతులు ఇచ్చిన కేంద్రం.. తర్వాత దానిని వెయ్యి మెగావాట్లకు కుదించిందని తెలిపారు. రాష్ట్రంలో మహిళా సంఘాల ద్వారా సోలార్‌ విద్యుత్తు ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్నామని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం మంత్రి ఉత్తమ్‌ మీడియాతో మాట్లాడుతూ.. పౌర సరఫరాల శాఖకు సంబంధించి పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పలు అంశాలపై ప్రహ్లాద్‌ జోషితో చర్చించినట్లు తెలిపారు. సుమారు రూ.2 వేల కోట్లు కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సి ఉందని అన్నారు. బకాయిలు విడుదల చేయాల్సిందిగా కేంద్ర మంత్రిని కోరామన్నారు. అన్ని అంశాలపైనా కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు.


ఇవి కూడా చదవండి

PM Modi: సింహం పిల్లలకు మోదీ ఫీడింగ్.. వీడియో వైరల్

Aurangazeb Row: ఔరంగజేబు వ్యాఖ్యల వివాదంపై అబూ అజ్మి క్షమాపణ

Bihar: అసెంబ్లీ ఎన్నికల వేళ.. మళ్లీ ఆయనకే బీజేపీ అధ్యక్ష పగ్గాలు

Bird flu: బర్డ్‌ఫ్లూపై కలెక్టర్ ఏమన్నారంటే..

Akhilesh Yadav: మనుషులా? మరబొమ్మలా?.. వారానికి 90 గంటల పనిపై అఖిలేష్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 05 , 2025 | 03:08 AM