Kaleshwaram Project: కాళేశ్వరంపై 10న సీఎం సమీక్ష!
ABN , Publish Date - Jun 06 , 2025 | 02:59 AM
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ (ఎన్‌డీఎ్‌సఏ) ఇచ్చిన నివేదికతోపాటు బ్యారేజీల వైఫల్యానికి కారకులైన వారిపై విజిలెన్స్
బనకచర్ల-గోదావరి అనుసంధానంపై కూడా..
ఉద్యోగుల అంశాలపైనే సుదీర్ఘ చర్చతో.. గురువారం నాటి భేటీలో జరగని సమీక్ష
హైదరాబాద్, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ (ఎన్‌డీఎ్‌సఏ) ఇచ్చిన నివేదికతోపాటు బ్యారేజీల వైఫల్యానికి కారకులైన వారిపై విజిలెన్స్ చేసిన సిఫారసులపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈనెల 10న సమీక్షించే అవకాశాలు ఉన్నాయి. గురువారం నాటి క్యాబినెట్ సమావేశంలోనే ఈ సమీక్ష ఉంటుందని భావించినా.. ఉద్యోగులకు సంబంధించిన అంశాలపైనే సుదీర్ఘంగా చర్చ జరగడంతో వాయిదా పడింది. వాస్తవానికి రెండున్నర నెలల కిందటే కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్‌డీఎ్‌సఏ నివేదిక ఇచ్చింది.
దాని ప్రకారం బ్యారేజీలపై కార్యాచరణ ప్రణాళికలు అందించాలని ప్రభుత్వం నిర్మాణ సంస్థలను కోరింది. కానీ మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ ధిక్కారస్వరం వినిపించడంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో సీఎం సమీక్ష కీలకంగా మారింది. ఇక కీలకమైన గోదావరి-బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టు అంశంపై కూడా సీఎం 10వ తేదీన సమీక్షించనున్నారు.