Share News

ఢిల్లీకి సీఎం రేవంత్‌.!

ABN , Publish Date - Jun 18 , 2025 | 04:47 AM

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు, ఎల్లుండి రెండ్రోజులపాటు అక్కడే ఉండనున్నట్టు సమాచారం.

ఢిల్లీకి సీఎం రేవంత్‌.!

  • ఇంగ్లండ్‌ మాజీ ప్రధాని టోనిబ్లెయిర్‌తో భేటీ

హైదరాబాద్‌, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు, ఎల్లుండి రెండ్రోజులపాటు అక్కడే ఉండనున్నట్టు సమాచారం. పెట్టుబడులకు సంబంధించి కీలక భేటీలో పాల్గొంటారని తెలిసింది. అలాగే పార్టీ అఽధిష్టానాన్ని, పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. ఇంగ్లండ్‌ మాజీ ప్రధాని టోనిబ్లెయిర్‌తో సీఎం రేవంత్‌ సమావేశం కానున్నట్టు సమాచారం.


టోనీబ్లెయిర్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గ్లోబల్‌ చేంజ్‌ (టీబీఐ)అనే ఎన్‌జీవోను బ్లెయిర్‌ నడిపిస్తున్నారు. ఇది అనేక దేశాల్లో పనిచేస్తోంది. ఈ క్రమంలో ఆయనతో భేటీ అయి పలు విషయాలపై చర్చించనున్నారు. కాగా ఏపీ టీడీపీ మంత్రి లోకేశ్‌ కూడా టోనిబ్లెయిర్‌తో సమావేశమవనున్నట్టు తెలిసింది.

Updated Date - Jun 18 , 2025 | 04:47 AM