CM Revanth Reddy : ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఎలా ఇద్దాం?
ABN , Publish Date - Jan 29 , 2025 | 03:32 AM
ఇందిరమ్మ ఇళ్లకు ఏవిధంగా ఇసుక సరఫరా చేయాలనే అంశంపై అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. దీనికోసం ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్.శ్రీధర్,
సరఫరా ఎలా చేయాలో అధ్యయనం చేయండి
ఇసుక మాఫియాను అరికట్టే చర్యలు తీసుకోండి
అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
నలుగురు ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు
వారంలోపు నివేదిక సమర్పించాలని ఆదేశం
4.50 లక్షల ఇళ్ల నిర్మాణానికి 112 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరం
హైదరాబాద్, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ ఇళ్లకు ఏవిధంగా ఇసుక సరఫరా చేయాలనే అంశంపై అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. దీనికోసం ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్.శ్రీధర్, ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్స్ కమిషనర్ శశాంక, టీజీ ఎండీసీ మేనేజింగ్ డైరెక్టర్ సుశీల్ కుమార్‌తో ఓ అధ్యయన కమిటీని నియమించారు. వారంలోపు అధ్యయనాన్ని పూర్తి చేసి నివేదిక సమర్పించాలని కమిటీకి సూచించారు. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక సరఫరా... గనుల శాఖపై సచివాలయంలో సీఎం రేవంత్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించిన నేపథ్యంలో లబ్ధిదారులకు ఇసుక ఏవిధంగా సరఫరా చేయాలనే దానిపై అధ్యయనం చేయాలని సూచించారు. రాష్ట్రంలో ఏటేటా నిర్మాణాలు పెరుగుతున్నా ఇసుక నుంచి ప్రభుత్వానికి ఆశించినంత ఆదాయం రావడం లేదని, అదే సమయంలో వినియోగదారులు ఎక్కువ ధరకే ఇసుక కొనుగోలు చేయాల్సి వస్తోందని చెప్పారు. వినియోగదారులకు తక్కువ ధరకే ఇసుక అందడంతో పాటు, ప్రభుత్వానికి ఆదాయం పెరిగేలా చూడాలని సూచించారు. ఇసుక మాఫియాను అరికట్టాలని ఆదేశించారు. మైనర్ ఖనిజాల గనులపై వేసిన జరిమానాల వసూళ్లపై ప్రశ్నించారు. మేజర్, మైనర్ ఖనిజ విధానంపై సమగ్రంగా అధ్యయనం చేసి రెండు వారాల్లో నివేదిక సమర్పించాలని కమిటీని ఆదేశించారు. సమీక్షలో గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారి పాల్గొన్నారు.
తక్కువ ధరకే..ఇచ్చే యోచన
ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మంజూరైన ఇంటికి అవసరమయ్యే ఇసుక, ఇనుము, సిమెంటును లబ్ధిదారులకు తక్కువ ధరలే ఇచ్చే విషయంలో ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటుంది. ఇందుకు సంబంధించి గృహ నిర్మాణ సంస్థ ఒక ప్రతిపాదన కూడా సిద్ధం చేసింది. ఒక్కో ఇంటికి ఎంత సిమెంటు, ఇనుము, ఇసుక అవసరం అనే అంచనాలను గృహ నిర్మాణ సంస్థ అధికారులు ప్రభుత్వానికి అందజేశారు. ఈ మేరకు ఒక్కో ఇంటి నిర్మాణానికి 25 క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరం అవుతుందని, రాష్ట్రవ్యాప్తంగా 4.50లక్షల ఇళ్ల నిర్మాణానికి దాదాపు 112 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరమవుతుందని పేర్కొన్నారు. ఒక్కో ఇంటికి 9 మెట్రిక్ టన్నుల సిమెంటు చొప్పున, 40.50లక్షల మెట్రిక్ టన్నుల సిమెంటు, ఒక్కో ఇంటికి 1.5 మెట్రిక్ టన్నుల చొప్పున సుమారు 68లక్షల మెట్రిక్ టన్నుల ఇనుము కావాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇసుక సరఫరా విధానంపై కమిటీ నివేదిక సమర్పించిన తర్వాత ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోనుంది.
మరిన్ని తెలుగు వార్తల కోసం..
Also Read: మాఘ మాసంలోనే అత్యధిక వివాహాలు.. ఎందుకంటే..
Also Read: ఆ రోజు మహాకుంభమేళకు వెళ్తున్నారా.. ఈ వార్త మీ కోసమే..
Also Read: ఆప్‌కి మద్దతుగా అఖిలేష్ ఎన్నికల ప్రచారం
Also Read: నీ ఇంట్లో నుంచి అవార్డు ఇస్తున్నావా సంజయ్..!
Also Read:ఆర్చర్ జ్యోతి సురేఖకు ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఇవ్వాలి
Also Read: అమెరికాలో ఘనంగా గణతంత్ర వేడుకలు.. రాజ్యాంగం గొప్పతనాన్ని వివరించిన వక్తలు