Share News

CM Revanth Reddy: లైఫ్‌ సైన్సెస్‌లో మైలురాయిగా హైదరాబాద్‌

ABN , Publish Date - Aug 05 , 2025 | 03:48 AM

తెలంగాణ లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో ఈరోజు చారిత్రక మైలురాయిగా నిలిచిపోతుందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు.

CM Revanth Reddy: లైఫ్‌ సైన్సెస్‌లో మైలురాయిగా హైదరాబాద్‌

  • అమెరికా ఫార్మా దిగ్గజం ‘ఎలీ లిల్లీ’ కార్యాలయాన్ని ప్రారంభించిన రేవంత్‌

హైదరాబాద్‌, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): తెలంగాణ లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో ఈరోజు చారిత్రక మైలురాయిగా నిలిచిపోతుందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. అమెరికా దిగ్గజ ఫార్మా కంపెనీ ‘ఎలీ లిల్లీ’ కంపెనీ కార్యాలయాన్ని సోమవారం గచ్చిబౌలిలో ప్రారంభించిన అనంతరం సీఎం మాట్లాడారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలల్లోనే తాము చేసిన ప్రయత్నాల ఫలితంగా ఈ రోజు హైదరాబాద్‌ ప్రపంచ స్థాయి జీసీసీ(గ్లోబల్‌ కేపబుల్‌ సెంటర్‌) రాజధానిగా ఎదిగిందని చెప్పారు. ’తెలంగాణ రైసింగ్‌ 2047’ దిశగా.. ఇది తాము వేసిన మరో ముందడుగుగా అభివర్ణించారు.


ఈ సందర్భంగా ఎలీ లిల్లీ సంస్థ ఉద్యోగులను హైదరాబాద్‌కు సాదరంగా ఆహ్వానిస్తున్నానని చెప్పారు. ఈ సంస్థను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడమంటే నగర ఘనతను ప్రపంచానికి చాటి చెప్పినట్లేనని, ఇందుకోసం శ్రమించిన మంత్రి శ్రీధర్‌ బాబు, జయేశ్‌ రంజన్‌ సహా ఇతర అధికారులను ఆయన అభినందించారు. 2 వేలకు పైగా ఫార్మా కంపెనీలతో.. దేశ లైఫ్‌ సైన్సెస్‌ రాజధానిగా హైదరాబాద్‌ ఇప్పటికే గుర్తింపు పొందిందని వెల్లడించారు. రాష్ట్రం నుంచే సుమారు 40 శాతం ఉత్పత్తులు వస్తున్నాయని సీఎం పేర్కొన్నారు. ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న ప్రతి 3 టీకాలలో ఒకటి హైదరాబాద్‌లో తయారవుతుండటం తెలంగాణకు గర్వకారణమన్నారు.


గల్వాన్‌ ఘటనలో చైనాకు క్లీన్‌చిట్‌ ఎందుకిచ్చారు: జైరాం రమేశ్‌

న్యూఢిల్లీ, ఆగస్టు 4: జవాబుదారీతనం నుంచి తప్పించుకోవడానికి మోదీ ప్రభుత్వం ఏమైనా చేయగలదని కాంగ్రెస్‌ పార్టీ విమర్శించింది. ఐదేళ్ల క్రితం భారత్‌-చైనా సరిహద్దులో జరిగిన గల్వాన్‌ ఘటనలో ప్రధాని మోదీ.. చైనాకు క్లీన్‌చిట్‌ ఎందుకిచ్చారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ సోమవారం ప్రశ్నించారు. గల్వాన్‌ ఘటన జరిగినప్పటి నుంచి దేశభక్తి కలిగిన ప్రతి భారతీయుడూ దీనిపై వివరణ కోరుతున్నాడని.. కానీ, మోదీ సర్కారు సమాధానం ఇవ్వడానికి బదులుగా ‘తిరస్కరించు, దృష్టి మరల్చు, అబద్ధం చెప్పు, సమర్థించు...’ (డీడీఎల్‌జే) విధానాన్ని అనుసరిస్తూ వస్తోందని జైరాం రమేశ్‌ విమర్శలు గుప్పించారు.మన సైనికులు వీరోచితంగా పోరాడి ప్రాణత్యాగం చేసిన నాలుగు రోజుల తర్వాత ప్రధాని మోదీ మాట్లాడుతూ.. మన భూభాగంలోకి ఎవరూ చొరబడలేదంటూ చైనాకు ఎందుకు క్లీన్‌ చిట్‌ ఇచ్చారని జైరాం రమేశ్‌ ‘ఎక్స్‌’లో ప్రశ్నించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కాళేశ్వరం నివేదికపై ఆరోపణలు.. బీఆర్ఎస్ పార్టీ సంచలన నిర్ణయం

కవితకు షాక్ ఇచ్చిన కోర్టు

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 05 , 2025 | 03:48 AM