Revanth Reddy: కలెక్టర్ల పనితీరుపై రేవంత్ ప్రశంసలు
ABN , Publish Date - Aug 05 , 2025 | 05:10 AM
ప్రభుత్వ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయి పర్యటనలు చేపడుతున్న కలెక్టర్లు, అధికారుల పనితీరుపై సీఎం రేవంత్‌రెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు.
ఆంధ్రజ్యోతి కథనం ఎక్స్‌లో పోస్ట్
హైదరాబాద్, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయి పర్యటనలు చేపడుతున్న కలెక్టర్లు, అధికారుల పనితీరుపై సీఎం రేవంత్‌రెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన ‘పల్లెల వద్దకే పాలన’ కథనాన్ని ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘‘నా ఆదేశాల మేరకు క్షేత్ర స్థాయి పర్యటనలకు వెళ్లి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ.. ఆసుపత్రుల్లో వైద్య సేవలు, సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను స్వయంగా వెళ్లి పరిశీలిస్తున్న కలెక్టర్లు, ఇతర అధికారులకు అభినందనలు. ప్రతి గూడెం, తండా, మారుమూల పల్లెకు ప్రజాపాలన చేరాలి. అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు అందాలి. ఇదే స్ఫూర్తిని ఇక ముందు కూడా కొనసాగిస్తారని ఆశిస్తున్నా’’ అంటూ రేవంత్‌రెడ్డి ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమాన రాకపోకలకు అంతరాయం
తీవ్ర ఇబ్బందులు పడిన ప్రయాణికులు
శంషాబాద్ రూరల్, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): భారీ వర్షం వల్ల సోమవారం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. శంషాబాద్ నుంచి 119 మంది ప్రయాణికులతో సాయంత్రం 6.35 గంటలకు రాంచీ వెళ్లాల్సిన ఇండిగో విమానం టేకాఫ్ తీసుకునే సమయంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో అధికారులు ఆ సర్వీసును రద్దు చేశారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రయాణికులు ఎయిర్‌పోర్టులో ఆందోళనకు దిగారు. ఎట్టకేలకు వరాణసీ నుంచి శంషాబాద్ వచ్చిన విమానంలో ప్రయాణికులు రాంచీకి వెళ్లేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అలాగే వరాణసీ నుంచి శంషాబాద్ రావాల్సిన విమానాన్ని ఇక్కడ వాతావారణం అనుకూలించకపోవడంతో బెంగుళూరుకు మళ్లించారు. కాగా, సమస్యల పరిష్కారం కోసం క్యాబ్ డ్రైవర్లు ఆందోళన చేపడుతున్న నేపథ్యంలో శంషాబాద్‌లో సోమవారం ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. క్యాబ్‌ల కోసం గంటల తరబడి పడిగాపులు కాశారు. 70 రోజులుగా ఎయిర్‌పోర్టులో క్యాబ్ డ్రైవర్లు ఆందోళన చేస్తున్నారు. జీఎంఆర్ అధికారులు, ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆందోళన కొసాగుతోంది. సోమవారం భారీ వర్షం వల్ల నడుస్తున్న కొన్ని క్యాబ్‌లు కూడా బంద్ అయ్యాయి. దీంతో ఎయిర్‌పోర్టులో దాదాపు 700మంది ప్రయాణికులు వర్షంలో తడుస్తూ క్యాబ్‌ల కోసం చూశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కాళేశ్వరం నివేదికపై ఆరోపణలు.. బీఆర్ఎస్ పార్టీ సంచలన నిర్ణయం
Read latest Telangana News And Telugu News