Share News

KTR : ‘రైతుబంధు’ రద్దుకు సీఎం రేవంత్‌రెడ్డి కుట్ర

ABN , Publish Date - Jan 29 , 2025 | 03:49 AM

‘‘రాష్ట్రంలో మాజీ సీఎం కేసీఆర్‌ ఆనవాళ్లు లేకుండా చేస్తానని చెబుతున్న సీఎం రేవంత్‌రెడ్డి, కేసీఆర్‌ ప్రవేశపెట్టిన రైతుబంధును రద్దు చేయాలని కుట్ర చేస్తున్నారు. అందుకే రైతుభరోసాను ఎన్నికలప్పుడు మాత్రమే ఇస్తూ

KTR : ‘రైతుబంధు’ రద్దుకు సీఎం రేవంత్‌రెడ్డి కుట్ర

ఎన్నికలప్పుడు మాత్రమే ఇస్తున్నారు

స్థానిక ఎన్నికల తర్వాత పథకం రద్దు చేస్తారు

రుణ మాఫీలో 25% కూడా పూర్తికాలేదు

బోనస్‌ విషయంలోనూ మోసం చేశారు

అన్నదాతలూ కాంగ్రె్‌స పార్టీని నిలదీయండి

100ు మాఫీ అయితే రాజకీయ సన్యాసం

నల్లగొండ రైతు మహాధర్నాలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

నల్లగొండ, జనవరి 28 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ‘‘రాష్ట్రంలో మాజీ సీఎం కేసీఆర్‌ ఆనవాళ్లు లేకుండా చేస్తానని చెబుతున్న సీఎం రేవంత్‌రెడ్డి, కేసీఆర్‌ ప్రవేశపెట్టిన రైతుబంధును రద్దు చేయాలని కుట్ర చేస్తున్నారు. అందుకే రైతుభరోసాను ఎన్నికలప్పుడు మాత్రమే ఇస్తూ రైతాంగాన్ని మోసం చేస్తున్నారు. స్థానిక ఎన్నికలయ్యాక రైతుబంధును రద్దు చేస్తారు’’ అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ రైతులకిచ్చిన హామీలను అమలు చేయాలనే డిమాండ్‌తో మంగళవారం నల్లగొండలోని క్లాక్‌టవర్‌ సెంటర్‌లో బీఆర్‌ఎస్‌ నిర్వహించిన రైతు మహాధర్నాలో ఆయన మాట్లాడారు. కేసీఆర్‌ సీఎంగా ఉన్న సమయంలో రైతులు నాట్లు వేసే సమయంలోనే రైతుబంధు వచ్చేదని, కానీ రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక ఎన్నికలప్పుడు మాత్రమే రైతుబంధు ఇస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే 2023 యాసంగి కోసం రూ.7,600కోట్ల రైతుబంధు నిధులు ఇస్తుంటే, ఎన్నికల కమిషన్‌కు లేఖ రాసి ఆపించిన రేవంత్‌రెడ్డి, ఆ డబ్బులనే పార్లమెంట్‌ ఎన్నికల ముందు విడుదల చేశారని విమర్శించారు. ఆ తర్వాత ఈ వానాకాలంలో రైతుబంధు ఎగ్గొట్టారని, ఇప్పుడు మళ్లీ జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్‌ ఎన్నికల్లో ఓట్లు దండుకునేందుకు రైతుభరోసా వేస్తామంటున్నారని దుయ్యబట్టారు. రైతులకు మేలు చేయాలనే ఏకైక లక్ష్యంతో నాటి సీఎం కేసీఆర్‌ 2017 యాసంగి నుంచి ప్రపంచంలోనే ఎక్కడా లేనివిధంగా రైతుబంధు కింద పెట్టుబడి సాయం అందించారని చెప్పారు. ఎన్నికల సమయంలో ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చిందని, రూ.49,500 కోట్ల నిధులు ఈ పథకానికి అవసరమని అంచనావేసి.. చివరకు రూ.12వేల కోట్లకు లోబడే రుణమాఫీ చేశారని అన్నారు. రుణమాఫీపై సీఎం సొంతూరు కొండారెడ్డిపల్లి అయినా, సొంత నియోజకవర్గం కొడంగల్‌లో అయినా ఏదైనా ఒక ఊరు వెళ్లి అక్కడి రైతులు వందశాతం రుణమాఫీ అయిందంటే రాజకీయ సన్యాసం చేస్తానని సవాల్‌ విసిరితే, సీఎం నోరుమెదపడం లేదని ఎద్దేవా చేశారు. ధాన్యం బోనస్‌ విషయంలోనూ రైతుల్ని మోసం చేశారని, అన్నిరకాల ధాన్యానికి ఇస్తామని చెప్పి, చివరకు సన్నవడ్లకేనంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని దుయ్యబట్టారు. రైతులు రైతుభరోసా వద్దంటున్నారని, బోనస్‌ ఇస్తే చాలంటున్నారని వ్యవసాయమంత్రి ప్రకటనలు ఇస్తున్నారని విమర్శించారు. ప్రతీ రైతుకు ఈ ప్రభుత్వం ఎకరాకు రూ.17,500 బకాయి ఉందని, స్థానిక ఎన్నికల ఓట్లకు వచ్చినప్పుడు రైతులు ఈ నిధుల కోసం నిలదీయాలని సూచించారు. ఏడాది కాంగ్రెస్‌ పాలనలో 410 మంది రైతులు, 55 మంది గురుకులాల విద్యార్థులు, వందమంది ఆటోడ్రైవర్లు, 35మంది చేనేత కార్మికులు చనిపోయారని వీటన్నింటికీ ఈ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అహంకారం, ఆకారాలు, పెరిగాయి తప్ప ఈ ఏడాదిలో నల్లగొండకు చేసిందేమీ లేదని కేటీఆర్‌ అన్నారు. ఎమ్మెల్యే జగదీ్‌షరెడ్డి మాట్లాడుతూ, కేసీఆర్‌ సీఎంగా ఉన్న హయాంలో తెలంగాణలో రైతును రాజుగా చేసి నిలబెట్టారని అన్నారు.


బాబూ.. మీ శిష్యుడికి చెప్పండి: కేటీఆర్‌

దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం రాష్ట్రం తెలంగాణ అని చంద్రబాబు గుర్తించడం సంతోషకరమని కేటీఆర్‌ అన్నారు. దశాబ్దకాలంగా ప్రభుత్వం అనుసరించిన ప్రగతిశీల విధానాలే దీనికి కారణమని ట్విటర్‌లో పేర్కొన్నారు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్న మీ మాజీ శిష్యుడి (రేవంత్‌రెడ్డి)కి బోధపడేలా చెప్పాలంటూ బాబుకు సూచించారు.


మరిన్ని తెలుగు వార్తల కోసం..

Also Read: మాఘ మాసంలోనే అత్యధిక వివాహాలు.. ఎందుకంటే..

Also Read: ఆ రోజు మహాకుంభమేళకు వెళ్తున్నారా.. ఈ వార్త మీ కోసమే..

Also Read: ఆప్‌కి మద్దతుగా అఖిలేష్ ఎన్నికల ప్రచారం

Also Read: నీ ఇంట్లో నుంచి అవార్డు ఇస్తున్నావా సంజయ్..!

Also Read:ఆర్చర్ జ్యోతి సురేఖకు ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఇవ్వాలి

Also Read: అమెరికాలో ఘనంగా గణతంత్ర వేడుకలు.. రాజ్యాంగం గొప్పతనాన్ని వివరించిన వక్తలు

Also Read: జగన్ నాడు నేడు.. అసలు రహస్యం చెప్పిన కేంద్రం

Also Read: బీజేపీ విజయం కోసం హస్తినకు చంద్రబాబు.. ఆ నియోజకవర్గాల్లో చక్రం తిప్పనున్న సీఎం

For Telangana News And Telugu News

Updated Date - Jan 29 , 2025 | 03:49 AM