CID Investigation: బీసీసీఐ గ్రాంట్లు ఎలా ఖర్చు చేశారు ?
ABN , Publish Date - Aug 09 , 2025 | 04:51 AM
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) ఎన్నికల్లో నిబంధనల ఉల్లంఘన, హెచ్‌సీఏ నిధుల దుర్వినియోగానికి సంబంధించిన కేసులో సీఐడీ దర్యాప్తు కొనసాగుతోంది.
హెచ్‌సీఏ కార్యదర్శి దేవరాజ్‌ను ప్రశ్నిస్తున్న సీఐడీ
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) ఎన్నికల్లో నిబంధనల ఉల్లంఘన, హెచ్‌సీఏ నిధుల దుర్వినియోగానికి సంబంధించిన కేసులో సీఐడీ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో అరెస్టయిన హెచ్‌సీఏ కార్యదర్శి దేవరాజ్ రామ్‌చందర్‌ను కస్టడీలోకి తీసుకున్న సీఐడీ ఆయన్ను వివిధ కోణాల్లో విచారిస్తోంది.
దేవరాజ్‌ను చంచల్‌గూడ జైలు నుంచి సీఐడీ కార్యాలయానికి శుక్రవారం తీసుకొచ్చిన అధికారులు న్యాయవాది సమక్షంలో ప్రశ్నించారు. బీసీసీఐ నుంచి గ్రాంట్లు రూపంలో వచ్చిన నిధులను ఎలా ఖర్చు చేశారు, హెచ్‌సీఏ ఖాతాల నుంచి బదిలీ అయిన నగదుకు సంబంధించిన వివరాలు, జగన్‌మోహన్ రావు దాఖలు చేసిన ఫోర్జరీ డాక్యుమెంట్లకు సంబంధించి దేవరాజ్‌ను ప్రశ్నించినట్టు తెలిసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
అవి చూసి షాక్ అయ్యా: బండి సంజయ్
‘బీజేపీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు’
For More AndhraPradesh News And Telugu News