Share News

Rajapakala Ticket Scandal: రాజ్‌ పాకాల కోసమే సన్‌రైజర్స్‌పై ఒత్తిడి

ABN , Publish Date - Jul 20 , 2025 | 03:11 AM

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ హెచ్‌సీఏ లో నిధుల దుర్వినియోగానికి సంబంధించిన కేసులో

Rajapakala Ticket Scandal: రాజ్‌ పాకాల కోసమే సన్‌రైజర్స్‌పై ఒత్తిడి
Rajapakala Ticket Scandal

  • ఐపీఎల్‌ కాంప్లిమెంటరీ టికెట్లలో గోల్‌మాల్‌

  • సీఐడీ విచారణలో వెలుగులోకి

హైదరాబాద్‌, జూలై19 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(హెచ్‌సీఏ)లో నిధుల దుర్వినియోగానికి సంబంధించిన కేసులో సీఐడీ దర్యాప్తు కొనసాగుతోంది. ఉప్పల్‌లోని రాజీవ్‌ గాంధీ స్టేడియంలోని హెచ్‌సీఏ కార్యాలయంలో శనివారం కూడా సీఐడీ అధికారులు తనిఖీలు చేశారు. తమ కస్టడీలో ఉన్న హెచ్‌సీఏ కోశాధికారి శ్రీనివాసరావు, సీఈవో సునీల్‌ కాంతేను స్టేడియానికి తీసుకువచ్చారు. అయితే, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ బావమరిది అయిన రాజ్‌ పాకాలకు లబ్ధి చేకూర్చేందుకే జగన్‌మోహన్‌ బృందం అదనపు టికెట్ల కోసం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఫ్రాంచైజీపై ఒత్తిడి తీసుకొచ్చినట్టు సీఐడీ అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. సన్‌రైజర్స్‌ ప్రతీ ఐపీఎల్‌ మ్యాచ్‌కు 3,900 టికెట్లను హెచ్‌సీఏకి కాంప్లిమెంటరీగా ఇచ్చేది. ఇందులో 2,400 టికెట్లను జిల్లా క్రికెట్‌ సంఘాలకు, అపెక్స్‌ కౌన్సిల్‌ సభ్యులకు హెచ్‌సీఏ ఇవ్వాలి. మిగిలిన టికెట్లను ఇతర స్టేక్‌హోల్డర్లు, హెచ్‌సీఏతో సంబంధాలు ఉన్నవారికి ఇవ్వవచ్చు. కానీ, జగన్‌మోహన్‌ బృందం జిల్లా, స్థానిక క్రికెట్‌ క్లబ్‌లకు ఇవ్వాల్సిన టికెట్లలో సగానికిపైగా నొక్కేసిందని గుర్తించారు. అంతేకాక, అదనంగా మరో 10 శాతం టికెట్లు కావాలని సన్‌రైజర్స్‌ ఫ్రాంచైజీని బ్లాక్‌మెయిల్‌ చేయడం వెనుక.. రాజ్‌పాకాలకు లబ్ధి చేకూర్చాలనే లక్ష్యం ఉందనేందుకు ప్రాథమిక ఆధారాలను సేకరించినట్లు తెలుస్తోంది. ఇక, శ్రీనివాసరావు, సునీల్‌ కాంతే సమక్షంలో హెచ్‌సీఏ అకౌంట్స్‌ విభాగంలోని పలు రికార్డులను కూడా తనిఖీ చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్

నేను ఎవరికీ భయపడేది లేదు... బండి సంజయ్‌కి స్ట్రాంగ్ కౌంటర్

Read Latest Telangana News and National News

Updated Date - Jul 20 , 2025 | 03:12 AM