Share News

HCA Scandal: హెచ్‌సీఏ ఎన్నికల్లో.. ఓట్లు వేసిన ఐఏఎస్‌, ఐపీఎస్‌‌లు!

ABN , Publish Date - Jul 22 , 2025 | 04:02 AM

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(హెచ్‌సీఏ) అక్రమాల కేసు దర్యాప్తులో సీఐడీ దూకుడు పెంచింది. హెచ్‌సీఏ అధ్యక్షుడి జగన్‌మోహన్‌ రావు ఎన్నికపై సీఐడీ అధికారులు ప్రధానంగా దృష్టి సారించారు.

HCA Scandal: హెచ్‌సీఏ ఎన్నికల్లో.. ఓట్లు వేసిన ఐఏఎస్‌, ఐపీఎస్‌‌లు!

  • ఓటర్ల వివరాలను సేకరించిన సీఐడీ

హైదరాబాద్‌, జూలై 21 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(హెచ్‌సీఏ) అక్రమాల కేసు దర్యాప్తులో సీఐడీ దూకుడు పెంచింది. హెచ్‌సీఏ అధ్యక్షుడి జగన్‌మోహన్‌ రావు ఎన్నికపై సీఐడీ అధికారులు ప్రధానంగా దృష్టి సారించారు. ఆయన ఎన్నికను అక్రమంగా గుర్తించింది. జగన్‌మోహన్‌ రావుకు ఓట్లు వేసిన వారిలో కొందరు ఐఏఎస్‌, ఐపీఎ్‌సలు ఉన్న ట్లు దర్యాప్తు అధికారులు నిర్ధారించారు. ఓటు వేసిన అధికారులను విచారిం చి, వాస్తవాలను తెలుసుకునేందుకు దర్యాప్తు సంస్థ రంగం సిద్ధం చేస్తోంది. హెచ్‌సీఏ అధ్యక్ష ఎన్నికల్లో 23 సంస్థలకు సంబంధించిన ఓట్లను జగన్‌మోహన్‌ అక్రమంగా వేయించుకున్నట్లు సీఐడీ గుర్తించింది.


అక్రమ ఓట్లతోనే ఆయన అధ్యక్షుడిగా గెలిచినట్లు తేల్చింది. ఎన్నికలో ఓట్లు వేసిన ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులకు నిజానికి ఓటు హక్కు ఉందా? వారు ఏ అర్హతతో ఓటు వేశారు? అనే అంశాలపై అధికారులు దృష్టిసారించారు. వీరితోపాటు గత ఎన్నికల్లో ఓటు వేసిన వారందరికీ నోటీసులు జారీ చేసి, విచారించేందుకు సీఐడీ సన్నద్ధమవుతోంది. నిజానికి జగన్‌మోహన్‌రావుకు అన్ని ఓట్లు వచ్చాయా? లేక గోల్‌మాల్‌ జరిగిందా? అనే కోణంపైనా దృష్టి సారించింది. కాగా..ఈ కేసులో అరెస్టయిన జగన్‌మోహన్‌రావు, ఇతర నిందితులు ప్రస్తుతం సీఐడీ కస్టడీలో ఉన్నారు. మంగళవారంతో వీరి కస్టడీ ముగుస్తుంది. మంగళవారం వీరిని కోర్టులో హాజరుపరిచి, తిరిగి జైలుకు పంపించనున్నారు. కస్టడీలో నిందితుల నుంచి కీలక సమాచారాన్ని సీఐడీ రాబట్టినట్లు సమాచారం.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆర్టీఐలో సామాజిక న్యాయం ఎక్కడ? ప్రభుత్వానికి ఎమ్మెల్సీ కవిత సూటి ప్రశ్న..

రేవంత్‌ నాటుకోడి.. కేటీఆర్‌ బాయిలర్‌ కోడి

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 22 , 2025 | 04:03 AM