NEET PG Exam: నీట్ పీజీ పరీక్ష వాయిదా
ABN , Publish Date - Jun 03 , 2025 | 05:16 AM
నీట్ పీజీ పరీక్షను సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయడానికి కేంద్రాలు సిద్ధం కాకపోవడంతో వాయిదా వేసారు. కొత్త పరీక్షా తేదీ త్వరలో ప్రకటిస్తారు అని ఎన్‌బీఈఎం పేర్కొంది.
హైదరాబాద్, జూన్ 2: వైద్య విద్యలో పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే ‘నీట్ పీజీ’ పరీక్ష వాయిదా పడింది. ఈ నెల 15న జరగాల్సిన ఈ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామ్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్‌బీఈఎంఎ్‌స) సోమవారం ప్రకటించింది. ఈ జాతీయ పరీక్షను రెండు షిఫ్టుల్లో కాకుండా దేశవ్యాప్తంగా ఒకే షిఫ్టులో నిర్వహించాలంటూ సుప్రీంకోర్టు మే 30 కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తగిన పరీక్షా కేంద్రాలు, మౌలిక సదుపాయాల ఏర్పాటు కోసం నీట్ పీజీ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ఎన్‌బీఈఎం్‌స పేర్కొంది. పరీక్ష నిర్వహించే కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తామని తెలిపింది.
ఇవీ చదవండి:
కేంద్రం హెచ్చరిక.. వెనక్కు తగ్గిన రైడ్ హెయిలింగ్ యాప్స్
పాక్‌కు గూఢచర్యం.. భారత యుద్ధ నౌకల వివరాలను చేరవేసిన ఇంజినీర్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి