జ్ఞాన భారతం మిషన్‌కు శ్రీకారం
ABN , Publish Date - Feb 02 , 2025 | 03:58 AM
కేంద్ర ప్రభుత్వం ‘జ్ఞాన భారతం మిషన్’ పేరుతో చారిత్రక సంపదను పరిరక్షించే ఓ బృహత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
కోటి రాతప్రతుల పరిరక్షణే లక్ష్యంగా బడ్జెట్‌లో ప్రకటన
హైదరాబాద్ సిటీ, ఫిబ్రవరి1(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం ‘జ్ఞాన భారతం మిషన్’ పేరుతో చారిత్రక సంపదను పరిరక్షించే ఓ బృహత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా నిలిచే అత్యంత విలువైన, అరుదైన కోటి రాతప్రతుల సంపదను భావితరాలకు అందించే లక్ష్యంతో భద్రపరిచడమే ఈ మిషన్ ప్రధా న లక్ష్యమని బడ్జెట్‌లో ప్రస్తావించింది.
ఈ క్రమంలో మ్యూజియంలు, గ్రంథాలయాలు, పలు సంస్థలతో పాటు వ్యక్తిగత సేకరణలోని చరిత్ర సంబంధమైన రాతప్రతులను మొదటగా సర్వే చేసి డాక్యుమెంటేషన్ చేస్తారు. అలాగే వీటిని భద్రపరచడం కూడా తమ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని ప్రధాని మోదీ ప్రసంగంలోనూ ప్రస్తావించారు. దీన్ని ఓ మంచి కార్యక్రమంగా తెలంగాణ గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు రియాజ్ కొనియాడారు.