CEC: సీఈసీ జ్ఞానేష్ కుమార్ రేపు రాష్ట్రానికి రాక..
ABN , Publish Date - Dec 18 , 2025 | 05:07 PM
భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ శుక్రవారం హైదరాబాద్‌కు రానున్నారు. అనంతరం శ్రీశైలం బయలుదేరి వెళతారు. తర్వాత గోల్కొండ కోట, చార్మినార్, సాలార్ జంగ్ మ్యూజియంలను సందర్శించే అవకాశముంది.
హైదరాబాద్, డిసెంబర్ 18: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్(CEC) జ్ఞానేష్ కుమార్ రేపు(డిసెంబర్ 19)న హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో హైదరాబాద్ విమానాశ్రయానికి వస్తారు. ఆ తర్వాత.. సాయంత్రం ఆంధ్రప్రదేశ్‌లోని ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రమైన శ్రీశైలానికి బయలుదేరి వెళతారు.
డిసెంబర్ 20న ఉదయం శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో మహా హారతి కార్యక్రమంలో పాల్గొని, స్వామివారిని దర్శించుకోనున్నారు. ఈ సందర్శనలో హైదరాబాద్‌లోని చారిత్రక ప్రదేశాలైన గోల్కొండ కోట, చార్మినార్, సాలార్ జంగ్ మ్యూజియం వంటి వాటినీ సందర్శించే అవకాశం ఉంది.
అనంతరం.. డిసెంబర్ 21న హైదరాబాద్‌లోని రవీంద్రభారతి ఆడిటోరియంలో తెలంగాణకు చెందిన బూత్ లెవల్ ఆఫీసర్ల(BLO)తో జ్ఞానేష్ కుమార్ సమావేశమై.. ఎన్నికల ప్రక్రియపై మార్గదర్శకాలు, దిశానిర్దేశం చేయనున్నారు.
ఈ సమావేశం ఎన్నికల విధానాలను మరింత బలోపేతం చేయడంలో కీలకపాత్ర పోషించే అవకాశముందని తెలుస్తోంది. సీఈసీ జ్ఞానేష్ కుమార్ సందర్శన రాష్ట్ర ఎన్నికల యంత్రాంగానికి మరింత ఊతమివ్వనుందని అధికారులు భావిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేష్ కుమార్ డిసెంబర్ 19 నుంచి 21 వరకు పర్యటన వివరాలు..
డిసెంబర్ 19 (శుక్రవారం): మధ్యాహ్నం 12:00 గంటలకు హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు
మధ్యాహ్నం/సాయంత్రం: అధికారులతో సమావేశాలు లేదా విశ్రాంతి
సాయంత్రం: హైదరాబాద్ నుంచి శ్రీశైలంకు రోడ్డు మార్గం ద్వారా బయలుదేరి వెళ్తారు
రాత్రి: శ్రీశైలంలో బస
డిసెంబర్ 20 (శనివారం): ఉదయం ఆలయ దర్శన, మహా హారతి కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శిస్తారు
ఉదయం/మధ్యాహ్నం: శ్రీశైలం నుంచి హైదరాబాద్‌కు తిరిగి రాక
మధ్యాహ్నం/సాయంత్రం: హైదరాబాద్‌లో చారిత్రక ప్రదేశాల సందర్శన.. గోల్కొండ కోట, చార్మినార్, హుస్సేన్ సాగర్ లేక్, సాలార్ జంగ్ మ్యూజియం మొదలైనవి.
డిసెంబర్ 21 (ఆదివారం):ఉదయం/మధ్యాహ్నం: హైదరాబాద్‌లో మిగిలిన చారిత్రక ప్రదేశాల సందర్శన
సాయంత్రం: రవీంద్రభారతిలో తెలంగాణ బూత్ లెవల్ ఆఫీసర్ల (BLOలు)తో ఇంటరాక్షన్
సాయంత్రం/రాత్రి: హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పయనం
Also Read:
జీవితంలో ఈ విషయాలు ముందే రాసి పెట్టి ఉంటాయి
ఒక తెల్ల వెంట్రుకను పీకితే మిగిలిన వెంట్రుకలు కూడా తెల్లగా అవుతాయా?
For More Latest News