CBI Probe Sparks: సీబీఐ పేరిట కాంగ్రెస్, బీజేపీ కుట్రలు
ABN , Publish Date - Sep 02 , 2025 | 03:55 AM
కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణకు అప్పగిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయడంపై..
రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్ ఆందోళనలు
సీఎం ఫ్లెక్సీలు, దిష్టిబొమ్మల దహనం
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్) : కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణకు అప్పగిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయడంపై బీఆర్‌ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్ కార్యకర్తలు ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహించారు. నల్లగొండలో బీఆర్‌ఎస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. భువనగిరిలోని బాబూ జగ్జీవన్‌రామ్ చౌరస్తా వద్ద సీఎం దిష్టిబొమ్మను దహనం చేసేందుకు బీఆర్‌ఎస్ కార్యకర్తలు ప్రయత్నించటంతో పోలీసు సిబ్బంది అడ్డుకున్నారు. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో బీఆర్‌ఎస్ నేతలు ధర్నా, రాస్తారోకోలు చేపట్టారు. సిద్దిపేట పట్టణంలో బీఆర్‌ఎస్ నాయకులు సీఎం రేవంత్‌రెడ్డి ఫ్లెక్సీని దహనం చేస్తుండగా మంటలు చెలరేగి విద్యార్థి విభాగం నాయకులకు అంటుకున్నాయి. వెంటనే నీళ్లు చల్లడంతో ప్రమాదం తప్పింది. హనుమకొండ జిల్లా బాలసముద్రంలో బీఆర్‌ఎస్ కార్యకర్తలు బైక్ ర్యాలీ చేపట్టారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో బీఆర్‌ఎస్ నేతలు పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ప్రతులను దహనం చేశారు. భద్రాద్రి జిల్లా మణుగూరు పట్టణంలో బీఆర్‌ఎస్ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. జనగామ జిల్లా కేంద్రంలో బీఆర్‌ఎస్ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించి, రాస్తారోకో చేపట్టారు. స్టేషన్‌ఘన్‌పూర్ మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ నేతలు నల్ల జెండాలతో బైక్ ర్యాలీ చేపట్టారు
ఈ వార్తలు కూడా చదవండి..
కేసీఆర్, హరీష్ రావు మధ్యంతర పిటిషన్లపై కొన్ని ఘడియల్లో విచారణ
తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీపై కమిటీ ఏర్పాటు
For More TG News And Telugu News