CBI: హైదరాబాద్‌లో సీబీఐ డైరెక్టర్
ABN , Publish Date - Sep 06 , 2025 | 04:41 AM
కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ శుక్రవారం హైదరాబాద్ వచ్చారు.
జోన్ అధికారులతో రెండు గంటలకు పైగా భేటీ
కాళేశ్వరం కేసు నేపథ్యంలో ఆకస్మిక పర్యటన?
హైదరాబాద్, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ శుక్రవారం హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ జోన్ సీబీఐ అధికారులతో రెండు గంటలకు పైగా సమావేశం నిర్వహించారు. కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తు కోరుతూ ఈ నెల 1న రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. ఈ నేపథ్యంలోనే ప్రవీణ్ సూద్ ఆకస్మికంగా హైదరాబాద్‌లో పర్యటించారు. అయితే, జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా కేసీఆర్, హరీశ్‌రావులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో, ప్రవీణ్ సూద్ ఏ విషయాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారనే విషయంలో స్పష్టత లేదు.