Hyderabad: అమ్మా నాన్నా.. నన్ను క్షమించండి
ABN , Publish Date - Jan 17 , 2025 | 04:32 AM
‘‘ప్రియమైన అమ్మానాన్న నన్ను క్షమించండి’’ అంటూ లేఖ రాసి ఓ బీటెక్ విద్యార్థి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఉరేసుకుని బీటెక్ విద్యార్థి ఆత్మహత్మ
అబ్దుల్లాపూర్‌మెట్, వనపర్తి రూరల్, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): ‘‘ప్రియమైన అమ్మానాన్న నన్ను క్షమించండి’’ అంటూ లేఖ రాసి ఓ బీటెక్ విద్యార్థి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ శివారు అబ్దుల్లాపూర్‌మెట్‌లో జరిగింది. వనపర్తి జిల్లాలోని పెద్దగూడెం గ్రామానికి చెందిన భానుప్రకాశ్ (19) రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లోని హాస్టల్‌లో ఉంటూ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. 4 రోజుల క్రితం సంక్రాంతి సెలవులకు ఇంటికి వెళ్లిన భానుప్రకాశ్ బుధవారం హాస్టల్‌కు తిరిగొచ్చాడు.
అదే రోజు అర్ధరాత్రి హాస్టల్ పెంట్ హౌజ్‌పై ఉన్న ఐరన్ మెట్లకు టవల్‌తో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే భాను ప్రకాశ్ ఆన్‌లైన్ గేమ్స్‌కు అలవాటు పడినట్లు తెలిసింది. ఆ కారణంగానే ఆత్మహత్మకు పాల్పడ్డాడా.. లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.