BRS leaders: కారును పోలిన గుర్తులు తొలగించాలి
ABN , Publish Date - Jul 16 , 2025 | 05:31 AM
స్థానిక ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ గుర్తు కారును పోలిన గుర్తులను తొలగించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను..
ఎస్‌ఈసీకి బీఆర్‌ఎస్ వినతి
హైదరాబాద్, జూలై 15 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ గుర్తు కారును పోలిన గుర్తులను తొలగించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను ఆ పార్టీనేతలు కోరారు. ఈ మేరకు ఎన్నికల కమిషనర్ రాణి కుముదినికి బీఆర్‌ఎస్ నేతలు బోయినిపల్లి వినోద్‌కుమార్, సోమ భరత్‌కుమార్ మంగళవారం వినతిపత్రం సమర్పించారు. కారు గుర్తును పోలిన గుర్తులు ఇవ్వడం వల్ల 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎ్‌సకు నష్టం వాటిల్లిందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని చపాతీ రోలర్, కెమెరా, షిప్ గుర్తులను ఇతర పార్టీలకు, వ్యక్తులకు కేటాయించొద్దని వారు విజ్ఞప్తి చేశారు.