Share News

BRS: కాళేశ్వరంపై పీపీటీ ఇచ్చేందుకు అవకాశమివ్వండి

ABN , Publish Date - Aug 30 , 2025 | 01:25 AM

అసెంబ్లీ సమావేశాలు శనివారం నుంచి ప్రారంభంకానున్న సందర్భంగా.. స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ను బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కేపీ వివేకానందగౌడ్‌

BRS: కాళేశ్వరంపై పీపీటీ ఇచ్చేందుకు అవకాశమివ్వండి

  • అసెంబ్లీ స్పీకర్‌ను కలిసి కోరిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు

హైదరాబాద్‌, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ సమావేశాలు శనివారం నుంచి ప్రారంభంకానున్న సందర్భంగా.. స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ను బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కేపీ వివేకానందగౌడ్‌, సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభా్‌షరెడ్డి కలిశారు. శాసనసభ సమావేశాల్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చలో భాగంగా బీఆర్‌ఎ్‌సఎల్పీకి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ (పీపీటీ) ద్వారా వివరించే అవకాశాన్ని కల్పించాలని కోరుతూ శుక్రవారం స్పీకర్‌కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం కేపీ వివేకానంద అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడుతూ ప్రజాసమస్యలపై అసెంబ్లీలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. తమ పార్టీని ఇబ్బంది పెట్టేందుకే ఘోష్‌ కమిషన్‌ను అడ్డంపెట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

Updated Date - Aug 30 , 2025 | 01:25 AM