Share News

BRS: అత్యధిక అప్పులు చేసిన.. మీరా మమ్మల్ని అనేది?

ABN , Publish Date - Feb 17 , 2025 | 02:51 AM

అప్పులను, మిగులు బడ్జెట్‌తో ముడిపెట్టడం సమంజసం కాదన్నారు. ఈ మేరకు నిర్మలా సీతారామన్‌కు ఆదివారం బహిరంగ లేఖ రాశారు. రాజ్యసభలో నిర్మల చేసిన వ్యాఖ్యలపై ఆయన అభ్యతరం వ్యక్తం చేశారు.

BRS: అత్యధిక అప్పులు చేసిన.. మీరా మమ్మల్ని అనేది?

రూ.125 లక్షల కోట్లు ఏం చేశారో.. మోదీ చెప్పాలి

నిర్మలా సీతారామన్‌కు కేటీఆర్‌ బహిరంగలేఖ

హైదరాబాద్‌, పిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): ‘‘బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలన తర్వాత కూడా తెలంగాణ మిగులు బడ్జెట్‌ రాష్ట్రమే..! దేశచరిత్రలో అత్యధిక అప్పులు చేసిన మీరా(బీజేపీ).. మమ్మల్ని అనేది?’’ అంటూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ను ప్రశ్నించారు. అప్పులను, మిగులు బడ్జెట్‌తో ముడిపెట్టడం సమంజసం కాదన్నారు. ఈ మేరకు నిర్మలా సీతారామన్‌కు ఆదివారం బహిరంగ లేఖ రాశారు. రాజ్యసభలో నిర్మల చేసిన వ్యాఖ్యలపై ఆయన అభ్యతరం వ్యక్తం చేశారు. ‘‘బీఆర్‌ఎస్‌ హయాంలో.. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితికి లోబడి చేసిన అప్పును తప్పుగా చూపించే ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ ఏర్పడిన సమయంలోనూ రాష్ట్రానికి దాదాపు రూ.70 వేల కోట్ల అప్పు ఉన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. పదేళ్ల తర్వాత కూడా మిగులు బడ్జెట్‌ రాష్ట్రంగానే తెలంగాణను కాంగ్రె్‌సకు అప్పజెప్పాం. చేసిన అప్పులతో ప్రజల దశాబ్దాల కష్టాలను తీర్చాం.


రాష్ట్రంలో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల కల్పనకు ఈ నిధులను ఉపయోగించాం’’ అని ఆ లేఖలో వెల్లడించారు. గడిచిన పదేళ్లలో మోదీ సర్కారు రూ.125 లక్షల కోట్ల మేర అప్పు చేసిందని, దాంతో ఏం చేశారో చెప్పాలని నిర్మలను నిలదీశారు. కేంద్రం చేసిన అప్పులన్నీ కార్పోరేట్ల లక్షల కోట్ల రుణాల మాఫీ కోసమేనని ఆరోపించారు. ‘‘స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి 14 మంది ప్రధానులు.. 65 ఏళ్లలో 56 లక్షలకోట్లు అప్పుచేేస్త.. మోదీ గడిచిన పదేళ్లలోనే రూ.125లక్షల కోట్ల చేశారు. బీజేపీకి అప్పులపై మాట్లాడే నైతిక హక్కు లేదు’’ అని వ్యాఖ్యానించారు. అటు కేంద్రబడ్జెట్‌లో, ఇటు రైల్వే కేటాయింపుల్లో బీజేపీ సవతి ప్రేమ కనబరుస్తోందని, రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న బీజేపీని ప్రజలు క్షమించరన్నారు ఇక, తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ మాట్లాడటం దారుణమని, రాష్ట్రానికి మీరిచ్చే బహుమానం ఈ అవమానాలేనా?’’ అని కేటీఆర్‌ ప్రశ్నించారు. కేంద్రబడ్జెట్‌లో పసుపుబోర్డుకు ఒక్కపైసా కూడా కేటాయించకపోవడం దారుణమన్నారు.


గురుకులాలు నిర్వీర్యం

గురుకుల విద్యాసంస్థలను రేవంత్‌రెడ్డి సర్కార్‌ నిర్వీర్యం చేస్తోందని, కేటీఆర్‌ ఆరోపించారు. ఆదివారం ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు చేశారు. ఏడాదిలో 50 మందికి పైగా విద్యార్థులు ఫుడ్‌ పాయిజన్‌, ఇతర కారణాలతో మరణించినా.. కాంగ్రెస్‌ సర్కార్‌లో కనీసం చలనంలేదన్నారు. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు కనీస పరామర్శ లేకపోగా.. అంత్యక్రియలకు పరామర్శకు వెళ్లే ప్రతిపక్షంపై ఈ ప్రభుత్వం నిర్బంధ చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు.


గురుకులాలు నిర్వీర్యం

గురుకుల విద్యాసంస్థలను రేవంత్‌రెడ్డి సర్కార్‌ నిర్వీర్యం చేస్తోందని, కేటీఆర్‌ ఆరోపించారు. ఆదివారం ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు చేశారు. ఏడాదిలో 50 మందికి పైగా విద్యార్థులు ఫుడ్‌ పాయిజన్‌, ఇతర కారణాలతో మరణించినా.. కాంగ్రెస్‌ సర్కార్‌లో కనీసం చలనంలేదన్నారు. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు కనీస పరామర్శ లేకపోగా.. అంత్యక్రియలకు పరామర్శకు వెళ్లే ప్రతిపక్షంపై ఈ ప్రభుత్వం నిర్బంధ చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తిరుపతి జిల్లా: నారావారిపల్లెలో విషాదం

ప్రభుత్వం నిరుపేదల గురించి ఆలోచించదా..: హరీష్‌రావు

ఏపీతో మూడు రాష్ట్రాలతో పోటీ

మనసులో మాట చెప్పిన రఘురామ..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Feb 17 , 2025 | 02:51 AM