Political Appointments : శాసనమండలిలో బీఆర్‌ఎస్ విప్‌లుగా సత్యవతిరాథోడ్, కేపీ వివేకానంద్
ABN , Publish Date - Feb 05 , 2025 | 04:48 AM
రాష్ట్ర శాసనమండలిలో బీఆర్‌ఎస్ పార్టీ విప్‌లుగా మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌లు నియమితులయ్యారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేసీఆర్ వారికి ఈ బాధ్యతలు అప్పగించారు. వారి
ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీగా మళ్లీ సత్యవతి.?
మహబూబాబాద్, దుండిగల్, ఫిబ్రవరి 4(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర శాసనమండలిలో బీఆర్‌ఎస్ పార్టీ విప్‌లుగా మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌లు నియమితులయ్యారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేసీఆర్ వారికి ఈ బాధ్యతలు అప్పగించారు. వారి నియామక పత్రాలను వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మంగళవారం శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా వివేకానంద్ మాట్లాడుతూ.. తనను విప్‌గా ప్రకటించి కేసీఆర్ తనపై మరింత బాధ్యత పెంచారన్నారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన కేసీఆర్, కేటీఆర్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ ఆదేశాల మేరకు పూర్తి నిబద్ధతతో బాధ్యతలు నిర్వర్తిస్తానని, ఈ అవకాశాన్ని సమర్థవంతంగా వినియోగించుకొని, పార్టీ అభివృద్ధికి, ప్రజల ఆంకాక్షలు నెరవేర్చేందుకు కృషి చేస్తానని ఆయన చెప్పారు. ఇక మరోనెల రోజుల్లో సత్యవతి రాథోడ్ ఎమ్మెల్సీ పదవీ కాలం ముగుస్తున్న నేపఽథ్యంలో ఆమెను విప్‌గా ఎంపిక చేయడంతో ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా మళ్లీ ఆమెనే నియమించనున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని వార్తల కోసం..
PM Modi: ఎవర్నీ వదిలిపెట్టలేదు.. ఆటాడుకున్న పీఎం
Maha Kumbh Mela 2025: కుంభమేళాకు ప్రధాని మోదీ.. పవిత్ర స్నానంతోపాటు ప్రత్యేక పూజలు
Delhi Elections: ఎన్నికలకు సిద్ధం.. 35,000 మంది పోలీసులు, సీసీ టీవీ నిఘా..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి