Minister Komatireddy: బీఆర్‌ఎస్ పని ఇక అయిపోయినట్టే
ABN , Publish Date - Sep 02 , 2025 | 04:00 AM
బీఆర్‌ఎస్ పని ఇక అయిపోయినట్టేనని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఇంకా 15 ఏళ్లు..
మరో 15 ఏళ్లు కాంగ్రె్‌సదే అధికారం: మంత్రి కోమటిరెడ్డి
హైదరాబాద్, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ పని ఇక అయిపోయినట్టేనని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఇంకా 15 ఏళ్లు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుందని తెలిపారు. సోమవారం సచివాలయంలో ఆయన మీడియాతో చిట్‌చాట్ చేశారు. కేసీఆర్ కుటుంబ గొడవల్లో తాము తలదూర్చబోమని చెప్పారు. కానీ తమ పార్టీ, తమ ముఖ్యమంత్రి గురించి మాట్లాడితే బాగుండదని హెచ్చరించారు. కవితనే కాదు ఇంకెవరు మాట్లాడినా ఊరుకోబోమని చెప్పారు. తాము కాళేశ్వరం మీద వేసిన కమిషన్ .. అందులో అవినీతి జరిగినట్లు రిపోర్టు ఇచ్చిందని తెలిపారు. అందుకే ఆ కేసును సీబీఐకి ఇచ్చామని, దొంగ ఎవరనేది అక్కడ తేలుతుందన్నారు. ప్రజాపాలన మీద దృష్టి సారించి, సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్పారు. పదేళ్ల క్రితమే కాంగ్రెస్ వస్తే బాగుండని ప్రజలు అనుకుంటున్నారని మంత్రి వెంకట్‌రెడ్డి తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కేసీఆర్, హరీష్ రావు మధ్యంతర పిటిషన్లపై కొన్ని ఘడియల్లో విచారణ
తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీపై కమిటీ ఏర్పాటు
For More TG News And Telugu News