Share News

భార్య కుటుంబంపై విష ప్రయోగం..

ABN , Publish Date - Jan 30 , 2025 | 05:28 AM

దాదాపు రెండేళ్ల క్రితం మియాపూర్‌లో వెలుగుచూసిన ఈ కేసులో నిందితుడు ముప్పరపు అజిత్‌ బ్రిటన్‌లో తలదాచుకున్నాడు. డాక్టర్‌ అయిన తన భార్య శిరీషను ఆమె కుటుంబాన్ని విష ప్రయోగం ద్వారా హత్య చేయించడానికి అజిత్‌ పలు ఎత్తులు వేశాడు. ఒక ముఠానే ఏర్పాటు చేశాడు.

భార్య కుటుంబంపై విష ప్రయోగం..

బ్రిటన్‌లో నిందితుడి అరెస్టు

నేరస్థుల అప్పగింత ఒప్పందం ద్వారా రప్పించే యత్నం

హైదరాబాద్‌, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): భార్య మీద ద్వేషంతో ఆమెతో పాటు ఆమె కుటుంబాన్ని అంతం చేయడానికి ప్రయత్నించిన వ్యక్తిని బ్రిటన్‌లో అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. దాదాపు రెండేళ్ల క్రితం మియాపూర్‌లో వెలుగుచూసిన ఈ కేసులో నిందితుడు ముప్పరపు అజిత్‌ బ్రిటన్‌లో తలదాచుకున్నాడు. డాక్టర్‌ అయిన తన భార్య శిరీషను ఆమె కుటుంబాన్ని విష ప్రయోగం ద్వారా హత్య చేయించడానికి అజిత్‌ పలు ఎత్తులు వేశాడు. ఒక ముఠానే ఏర్పాటు చేశాడు. భార్య కుటుంబానికి పంపించిన మసాల పొడుల్లో పాదరసాన్ని కలిపించాడు. దాన్ని ఆహారంలో వాడుకున్న శిరీష తల్లి ఉమా మహేశ్వరి చికిత్స పొందుతూ 2023లో మరణించింది. శిరీష సోదరుడు అస్వస్థతకు గురయ్యారు. దీంతో భర్తను అనుమానించిన శిరీష పోలీసులను ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో నిందితుడికి సహకరించిన ఆరుగురిని అరెస్టు చేశారు. బ్రిటన్‌లో తలదాచుకున్న అజిత్‌ను ఈ నెల 17న ఇంటర్‌పోల్‌ సాయంతో అక్కడి అధికారులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ క్రమంలో నిందితుడిని నేరస్థుల అప్పగింతలో భాగంగా హైదరాబాద్‌కు రప్పించడానికి కావాల్సిన చట్టపరమైన చర్యలను సైబరాబాద్‌ పోలీసులు ప్రారంభించారు.


ఇవీ చదవండి:

పరువు కాపాడిన తిలక్-వరుణ్.. సీనియర్లను నమ్ముకుంటే అంతే సంగతులు

సంజూ కెరీర్ ఫినిష్.. ఒక్క షాట్ ఎంత పని చేసింది

అతడి వల్లే ఓడాం.. ఇది అస్సలు మర్చిపోను: సూర్య

టీమిండియాకు కొత్త కెప్టెన్.. చేజేతులా చేసుకున్న సూర్య

ఇంత పొగరు అవసరమా హార్దిక్.. ఆల్‌రౌండర్‌కు స్ట్రాంగ్ వార్నింగ్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 30 , 2025 | 05:29 AM