అర్చకులకు పింఛన్ సదుపాయం కల్పించండి
ABN , Publish Date - Jan 18 , 2025 | 04:30 AM
సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న అర్చకుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్‌కు బ్రాహ్మణ సంఘాల సమాఖ్య విజ్ఞప్తి చేసింది.

బ్రాహ్మణ సంఘాల సమాఖ్య విజ్ఞప్తి
హైదరాబాద్, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న అర్చకుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్‌కు బ్రాహ్మణ సంఘాల సమాఖ్య విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కమిషనర్‌ను కలిసి సమాఖ్య చైర్మన్ కృష్ణమూర్తి ఇతరులు వినతిపత్రం అందజేశారు. ధూపదీప ఆలయాల్లో ప్రస్తుతం చెల్లిస్తున్న రూ. 10 వేల భృతిని రూ. 20 వేలకు పెంచేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే దేవాదాయ శాఖ పరిధిలో విధులు నిర్వహిస్తూ వేతనం పొందుతున్న అర్చకులకు పింఛన్ సదుపాయం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఆలయ క్యాటగిరీతో సంబంధం లేకుండా డీఏ ఇతర సదుపాయాలు అర్చకులందరికీ సమంగా కల్పించాలన్నారు.