Bandi Sanjay: నిరుద్యోగుల పక్షాన పోరాడాం
ABN , Publish Date - Feb 17 , 2025 | 02:40 AM
కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న ఎమ్మెల్సీ అభ్యర్థులు ఏనాడైనా నిరుద్యోగులు, ఉద్యోగులు, ఉపాధ్యాయు పక్షాన పోరాటం చేశారా.? అని ప్రశ్నించారు. ఆదివారం కరీంనగర్‌లో నిర్వహించిన సోషల్ మీడియా కార్యకర్తల సమావేశంలో సంజయ్ మాట్లాడారు.

కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతలకు ఆ చరిత్ర లేదు
కాంగ్రె్‌సకు దమ్ముంటే స్థానిక ఎన్నికలు పెట్టాలి
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంజయ్
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)
నిరుద్యోగులు, ఉద్యోగుల పక్షాన పోరాడి తాము లాఠీ దెబ్బలు తిన్నామని.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకులకు నిరుద్యోగుల పక్షాన ఉద్యమాలు చేసిన చరిత్ర లేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న ఎమ్మెల్సీ అభ్యర్థులు ఏనాడైనా నిరుద్యోగులు, ఉద్యోగులు, ఉపాధ్యాయు పక్షాన పోరాటం చేశారా.? అని ప్రశ్నించారు. ఆదివారం కరీంనగర్‌లో నిర్వహించిన సోషల్ మీడియా కార్యకర్తల సమావేశంలో సంజయ్ మాట్లాడారు. ప్రజా సమస్యలపై సోషల్ మీడియాలో పోస్టులు చేసిన బీజేపీ కార్యకర్తలపై నాటి బీఆర్‌ఎస్.. నేటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కేసులుపెట్టి వేధిస్తున్నాయని మండిపడ్డారు. తాము గ్రూప్-1 అభ్యర్థుల పక్షాన పోరాడితే.. తమ మధ్య చేరి విధ్వంసం సృష్టించాలని బీఆర్‌ఎస్ నాయకులు ప్రయత్నించారని వెల్లడించారు. ప్రతి నెల 1న ఉద్యోగులు, ఉపాధ్యాయులకు జీతాలు రావాలని పోరాడామని తెలిపారు.
317 జీవో దీక్ష నిర్వహిస్తే.. తన కార్యాలయ గేట్లను గ్యాస్‌కట్టర్లతో కోశారని తెలిపారు. తన ఆఫీసును జేసీబీతో కూల్చాలని కేసీఆర్ పోలీస్ కమిషనర్‌కు ఆదేశాలు ఇచ్చారని పేర్కొన్నారు. అయినా ఏనాడూ భయపడలేదని, పోరాటాన్ని విరమించలేదని తెలిపారు. కాంగ్రెస్ నేతలు ప్రతి పనికి 14 నుంచి 18 శాతం కమీషన్ అడుగుతున్నారని సంజయ్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను ఎప్పటి నుంచి అమలు చేస్తారో స్పష్టం చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాం డ్ చేశారు. గ్యారెంటీలు, హామీలను అమలు చేయకుండా ప్రజల దృష్టి మరల్చే రాజకీయాలు చేస్తున్న కాం గ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులను గల్లా పట్టి నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు సంజయ్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ముంటే సత్వరం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సవాల్ చేశారు. ఓటమి భయంతోనే సర్కారు వెనకడగు వేస్తోందని అన్నారు. పంచాయతీలకు సర్పంచ్‌లు లేకపోతే 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల కావన్న సంగతి తెలిసి కూడా ఎన్నికలు నిర్వహించకుండా రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తో
బీసీ కులగణనకు వ్యతిరేకం కాదు: ఈటల
బీసీ కులగణనకు బీజేపీ వ్యతిరేకం కాదని, ఆ రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్‌లో ఆమోదించడానికి బీజేపీ సిద్ధంగా ఉందని ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. బీసీ కులగణనను చట్టబద్ధత కలిగిన సంస్థలతో చేయించి, దానికి అసెంబ్లీలో చట్టం చేస్తే, 42శాతం బీసీ రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్‌లో ఆమోదించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ బీజేపీ కార్యాలయంలో, భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో ఆదివారం ఈటల మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి పాలనను విస్మరించి.. ఢిల్లీ పెద్దల మెప్పు పొందడానికి డబ్బు సంచులతో వెళ్లి.. వారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని విమర్శించారు.
ప్రజల దృష్టిని మరల్చేందుకు సీఎం రేవంత్ యత్నం: లక్ష్మణ్
అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడుస్తున్నా.. హామీలను అమలు చేయకుండా.. ప్రజల దృష్టిని మరల్చేందుకు మూడు నెలలకోసారి సీఎం రేవంత్‌రెడ్డి ఏదో ఒక అంశాన్ని తెరపైకి తెస్తున్నారని ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. మొన్నటిదాకా హైడ్రా, మూసీ ప్రక్షాళన, ఇప్పుడు బీసీ కులగణన పేరుతో రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆదివారం నిజామాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. ఓట్ల కోసమే ముస్లింలను బీసీ జాబితాలో చేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని విమర్శించారు. బీసీల హక్కులు, రిజర్వేషన్లను ముస్లింలకు అప్పజెప్పేందుకు రాహుల్‌గాంధీ సూచనతో రేవంత్‌రెడ్డి పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు. ముస్లింలను చేర్చిన బీసీ బిల్లును కేంద్రానికి ఎలా పంపుతారని ప్రశ్నించారు. కేవలం బీసీల రిజర్వేషన్ల బిల్లును పంపితే కేంద్రంతో మాట్లాడి ఆమోదించేలా చూస్తామన్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పని అయిపోయిందని ఎంపీ అర్వింద్ అన్నారు. ఉత్తర తెలంగాణలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులు లేకపోవడమే అందుకు నిదర్శనమన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తిరుపతి జిల్లా: నారావారిపల్లెలో విషాదం
ప్రభుత్వం నిరుపేదల గురించి ఆలోచించదా..: హరీష్‌రావు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News