Share News

BJP: కవితను బీజేపీలోకి తీసుకోం

ABN , Publish Date - Sep 05 , 2025 | 04:32 AM

బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన కల్వకుంట్ల కవితను తమ పార్టీలోకి తీసుకోబోమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు అన్నారు. బీజేపీలో అవినీతిపరులకు చోటు లేదన్నారు.

BJP: కవితను బీజేపీలోకి తీసుకోం

కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యం వల్లే యూరియా కొరత

  • ఏమీ సాధించలేకే మోదీపై విమర్శలు: రాంచందర్‌రావు

  • జీఎస్టీ శ్లాబ్‌ల తగ్గింపుతో సామాన్యులకు మేలు

  • మోదీ చిత్రపటానికి మహిళా మోర్చా పాలాభిషేకం

హైదరాబాద్‌, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన కల్వకుంట్ల కవితను తమ పార్టీలోకి తీసుకోబోమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు అన్నారు. బీజేపీలో అవినీతిపరులకు చోటు లేదన్నారు. కవిత సస్పెన్షన్‌, రాజీనామా అంతా వారి కుటుంబ గొడవ అని, వాటిపై స్పందించాల్సిన అవసరం తమకు లేదని పేర్కొన్నారు. గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. అవినీతిలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ కవల పిల్లలు అని, రాష్ట్రాన్ని లూటీ చేసిన పార్టీని మరో పార్టీ కాపాడుతోందని ఆరోపించారు. సీబీఐ విచారణ ఒక్క మేడిగడ్డపై మాత్రమే కాకుండా మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుపై జరపాలని డిమాండ్‌ చేశారు. ‘‘సామాన్యులు, రైతులు, మధ్యతరగతి, యువతకు నేరుగా ఆర్థిక ఊరట కలిగించేలా జీఎస్టీ స్లాబ్‌లను సులభతరం చేసి ప్రధాని మోదీ చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. అత్యవసర వస్తువులపై పన్ను తగ్గింపును స్వాగతిస్తున్నాం. కాంగ్రెస్‌ పార్టీ ఏమీ సాధించలేక.. ప్రధాని మోదీపై విమర్శలు చేస్తోంది. మోదీ మాతృమూర్తిని దూషించేలా చేసిన వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండిస్తోంది’’ అని రాంచందర్‌రావు అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యం వల్లే రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడిందన్నారు. కేంద్రం సరఫరా చేసిన యూరియా బ్లాక్‌మార్కెట్‌కు తరలకుండా, దళారుల చేతికి అందకుండా చూడడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. మహబూబ్‌నగర్‌లో కొంతమంది కాంగ్రెస్‌ నాయకులే యూరియా బస్తాలను ఎత్తుకుపోయినట్లు ప్రచారం జరుగుతోందన్నారు. కాగా, జీఎస్టీ శ్లాబులు తగ్గించి మోదీ ప్రభుత్వం సామాన్యులకు మేలు చేసిందంటూ బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు మేకల శిల్పారెడ్డి ఆధ్వర్యంలో ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

బీఆర్‌ఎస్‌కు దోచిపెడుతున్న గ్రానైట్‌ వ్యాపారులు: బండి

కరీంనగర్‌, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి ప్రతినిఽధి): గ్రానైట్‌ వ్యాపారులు బీఆర్‌ఎస్‌ పార్టీకి 20 ఏళ్లుగా డబ్బులు దోచి పెడుతున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ఆరోపించారు. వందల కోట్లు దోచి పెట్టారని, ఇంకెన్నాళ్లు దోచి పెడతారని ప్రశ్నించారు. గురువారం కరీంనగర్‌లో గణేష్‌ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించడానికి వచ్చిన కేంద్ర మంత్రిని గ్రానైట్‌ వ్యాపారులు కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘‘సమాజానికి సేవ చేయాలన్న ఆలోచన మాత్రం మీకు రావడంలేదు. ఒక్కో గ్రానైట్‌ కటింగ్‌ ఫ్యాక్టరీ నుంచి సభ్యత్వం పేరుతో గ్రానైట్‌ అసోసియేషన్‌ నాయకులు రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు వసూలు చేశారు. 500 ఫ్యాక్టరీల నుంచి వసూలు చేసినట్లు సమాచారం ఉంది. వాటిని ఏం చేశారో చెప్పాలి’’ అని సంజయ్‌ అన్నారు.

Updated Date - Sep 05 , 2025 | 05:20 AM