Ramachander Rao: కన్వర్ట్ అయ్యింది మోదీ కాదు.. రాహుల్
ABN , Publish Date - Jul 29 , 2025 | 05:11 AM
ప్రధాని మోదీ కన్వర్టెడ్ బీసీ అంటూ రేవంత్‌రెడ్డి విమర్శలు చేయడం విడ్డూరంగా ఉంది. వాస్తవానికి కన్వర్ట్ అయ్యింది మోదీ కాదు... కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీనే.
బీసీల సంక్షేమంపై కాంగ్రెస్ సర్కార్‌ది నటనే
ముస్లింలకు రిజర్వేషన్‌నే మేం వ్యతిరేకిస్తున్నాం
బీసీలకు 42% ఇవ్వాలన్న డిమాండ్‌తో 2న ధర్నా
మీడియాతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
హైదరాబాద్, జూలై 28 (ఆంధ్రజ్యోతి): ‘‘ప్రధాని మోదీ కన్వర్టెడ్ బీసీ అంటూ రేవంత్‌రెడ్డి విమర్శలు చేయడం విడ్డూరంగా ఉంది. వాస్తవానికి కన్వర్ట్ అయ్యింది మోదీ కాదు... కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీనే. ఈ విషయాన్ని కాంగ్రెస్ నాయకులు గుర్తించాలి’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు వ్యాఖ్యానించారు. బీసీల సంక్షేమంపై కాంగ్రె్‌సది నటనేనని, మాటలు చెప్పడం తప్ప.. చేతల్లో చిత్తశుద్ధి లేదని దుయ్యబట్టారు. ఈ నటనకే ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చని దుయ్యబట్టారు. ఇది బీసీలకు వెన్నుపోటు పొడవడమేనని ధ్వజమెత్తారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం రాంచందర్‌రావు మీడియాతో మాట్లాడారు. బీసీల ఓట్ల కోసం కాంగ్రెస్ ఆలోచిస్తుంటే.. వారి సంక్షేమం గురించి బీజేపీ ఆలోచిస్తోందన్నారు. బీసీల ముసుగులో ముస్లింలకు రిజర్వేషన్ కల్పించాలన్న కాంగ్రెస్ కుట్రనే బీజేపీ వ్యతిరేకిస్తోందని తెలిపారు.
బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వచ్చే నెల 2న ధర్నాచౌక్ వద్ద మహాధర్నా చేపట్టనున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కుల గణన రాజ్యాంగబద్ధంగా జరిగిన ప్రక్రియకాదని, అది గణాంకాల సేకరణ మాత్రమేనన్నారు. కులగణన వివరాలను ప్రభుత్వం ఇప్పటికీ బయట పెట్టకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. తాము కులగణనకు వ్యతిరేకం కాదని, శాస్త్రీయంగా జరగాలన్నదే తమ అభిమతమని స్పష్టంచేశారు. ప్రధాని మోదీ నిర్ణయం మేరకు జనగణనలోనే కులగణన చేయడం ద్వారా దేశంలోని వివిధ సామాజిక వర్గాల గణాంకాలు స్పష్టంగా వెలుగులోకి రానున్నాయని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో బీసీలకే పెద్దపీట వేస్తామని ప్రకటించారు. కాగా, మంగళ, బుధవారాల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాంచందర్‌రావు పర్యటించనున్నారు.
ఇవి కూడా చదవండి..
కాల్పుల విరమణలో అమెరికా పాత్ర లేదు, మోదీకి ఫోన్ కాల్ రాలేదు
22 నిమిషాల్లో ఆపరేషన్ సిందూర్ పూర్తి చేశాం: రాజ్‌నాథ్
For More National News and Telugu News..