Share News

K Lakshman: రేవంత్‌ పదవికి మంత్రులే ఎసరు పెడుతున్నారు

ABN , Publish Date - Jul 03 , 2025 | 03:39 AM

సీఎం రేవంత్‌ పదవికి మంత్రులే ఎసరు పెడుతున్నారని.. ఈ విషయం రేవంత్‌కు కూడా తెలుసునని బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్‌ అన్నారు.

K Lakshman: రేవంత్‌ పదవికి మంత్రులే ఎసరు పెడుతున్నారు

  • సెంటిమెంట్‌ను రగిల్చేందుకే బనకచర్ల వివాదం: లక్ష్మణ్‌

హైదరాబాద్‌, జూలై 2 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌ పదవికి మంత్రులే ఎసరు పెడుతున్నారని.. ఈ విషయం రేవంత్‌కు కూడా తెలుసునని బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్‌ అన్నారు. తన మంత్రులను ఏమీ అనలేక బీజేపీ మీద నెపంనెడుతున్నారని చెప్పారు. మంత్రులు బీఆర్‌ఎ్‌సను అక్కున చేర్చుకుని.. వారితో లోపాయికారిగా పని చేస్తున్నారని ఆరోపించారు. బుధవారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు.


ఎన్నికల సమయంలో కాళేశ్వరం అవినీతిపై ప్రచారం చేసి లబ్ధిపొందిన కాంగ్రెస్‌, అధికారంలోకి వచ్చాక విచారణ పేరుతో కాలయాపన చేస్తోందని ఆరోపించారు. తెలంగాణ సెంటిమెంట్‌ను పండించేందుకు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ బనకచర్ల అంశం తెరపైకి తీసుకొచ్చాయని చెప్పారు. నీటి పంపకాల మీద ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి మాట్లాడుకోవాలని సలహా ఇచ్చారు.

Updated Date - Jul 03 , 2025 | 03:39 AM