Share News

Bird Flu: 8,000 కోళ్లు మృతి

ABN , Publish Date - Mar 03 , 2025 | 04:50 AM

సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో బర్డ్‌ ఫ్లూ కలకలం రేగింది. వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడటమే ఇందుకు కారణం. సంగారెడ్డి జిల్లా చౌటకూర్‌ మండలం బొమ్మారెడ్డిగూడెం సమీపంలోని ఓ పౌల్ర్టీఫాంలో మూడు రోజుల వ్యవధిలో ఏడు వేల కోళ్లు మరణించాయి.

Bird Flu: 8,000 కోళ్లు మృతి

  • సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో బర్డ్‌ఫ్లూ కలకలం

పుల్‌కల్‌, కొల్చారం, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో బర్డ్‌ ఫ్లూ కలకలం రేగింది. వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడటమే ఇందుకు కారణం. సంగారెడ్డి జిల్లా చౌటకూర్‌ మండలం బొమ్మారెడ్డిగూడెం సమీపంలోని ఓ పౌల్ర్టీఫాంలో మూడు రోజుల వ్యవధిలో ఏడు వేల కోళ్లు మరణించాయి. మెదక్‌ జిల్లా కొల్చారం మండలం నాయిని జలాల్‌పూర్‌లోని ఓ కోళ్ల ఫామ్‌లో శుక్ర, శనివారాల్లో కలిపి వెయ్యికి పైగా కోళ్లు వింత వ్యాధితో చనిపోయాయి. దీంతో బర్డ్‌ఫ్లూ వల్లే ఈ కోళ్లు చనిపోయాయనే చర్చ జరుగుతోంది. తన ఫౌలీ్ట్ర ఫాంలో మూడు రోజుల వ్యవధిలో ఏడు వేల కోళ్లు మరణించడంతో బొమ్మారెడ్డిగూడెం గిరిజన తండాకు చెందిన జదావత్‌ ప్రవీణ్‌కు పశువైద్యాధికారులను సంప్రదించాడు.


ఆ పౌలీ్ట్రఫాంను ఆదివారం సందర్శించిన వైద్యాధికారి.. మృతి చెందిన కోళ్లను పరిశీలించి.. కొన్నింటిని పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. అయితే, కోళ్ల మృతికి స్పష్టమైన కారణాన్ని వెల్లడించలేదు. కాగా, ఫిబ్రవరి 23న చౌటకూర్‌ మండలం తాడ్దానిపల్లి శివారులోని ఓ పౌలీ్ట్రఫాంలో 900 కోళ్లు వైరస్‌ బారినపడి మరణించడం గమనార్హం. ఇక, మెదక్‌ జిల్లా జలాల్పూర్‌లో సతీష్‌గౌడ్‌కు చెందిన ఫామ్‌లో రెండ్రోజుల వ్యవధిలో వెయ్యి కోళ్లు మరణించగా పశువైద్యాధికారులు సోమవారం ఆ ప్రాంతాన్ని సందర్శించనున్నారు.

Updated Date - Mar 03 , 2025 | 04:50 AM