Share News

Bhatti Vikramarka: సన్నబియ్యం పథకం దేశానికే రోల్‌ మోడల్‌

ABN , Publish Date - Apr 14 , 2025 | 04:18 AM

సన్నబియ్యం పథకం దేశానికే రోల్‌మోడల్‌గా నిలిచిందని, తెలంగాణ ప్రభుత్వానికి ఇది ఎలా సాధమైందని తెలుసుకునేందుకు ఇతర రాష్ట్రాల వారు రాష్ట్రం వైపు చూస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.

Bhatti Vikramarka: సన్నబియ్యం పథకం దేశానికే రోల్‌ మోడల్‌

  • పథకానికి రూ.13వేల కోట్ల ఖర్చు: భట్టి విక్రమార్క

మధిరటౌన్‌, ఏప్రిల్‌ 13(ఆంధ్రజ్యోతి): సన్నబియ్యం పథకం దేశానికే రోల్‌మోడల్‌గా నిలిచిందని, తెలంగాణ ప్రభుత్వానికి ఇది ఎలా సాధమైందని తెలుసుకునేందుకు ఇతర రాష్ట్రాల వారు రాష్ట్రం వైపు చూస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఖమ్మం జిల్లా మధిరలోని తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం విలేరరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.


ధనిక రాష్ట్రమైన తెలంగాణను గత పాలకులు అప్పుల కుప్పగా మార్చారని, పదేళ్ల పాలనలో సన్నబియ్యం ఇస్తామని మాటలు చెప్పడం, పాటలు పాడడమే తప్ప ఏ పేదవాడికి న్యాయం చేసింది లేదని విమర్శించారు.ఈ పథకం కోసం ప్రభుత్వం రూ.13,525కోట్లు ఖర్చు చేస్తోందని, 90లక్షల కార్డులతో 2.85 కోట్ల మందికి సన్నబియ్యం అందిస్తున్నట్లు తెలిపారు. మరికొన్ని రోజుల్లో 10 లక్షల కొత్త కార్డులు ఇస్తామని, మొత్తం 3.10కోట్ల మందికి సన్న బియ్యం అందిస్తామని ఆయన చెప్పారు.

Updated Date - Apr 14 , 2025 | 04:18 AM