Bhatti Vikramarka: ఉద్యోగాలిస్తేనే రాష్ట్ర ఏర్పాటుకు సార్థకత
ABN , Publish Date - Apr 05 , 2025 | 04:15 AM
యువతకు ఉద్యోగాలు ఇస్తేనే... తెలంగాణ ఏర్పాటుకు సార్థకత, అర్థం, పరమార్థం ఉంటుందన్న ఆలోచనతో ప్రజాప్రభుత్వం ముందుకెళ్తోందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

చదువుకున్న ప్రతి బిడ్డకు ఉపాధి అవకాశాలు.. రూ.9వేల కోట్లతో రాజీవ్ యువ వికాసం అమలు’
112 మంది ‘యాదాద్రి’ నిర్వాసితులు, 51మంది డీఏవోలకు నియామక పత్రాలు
హైదరాబాద్, ఏప్రిల్ 4(ఆంధ్రజ్యోతి): యువతకు ఉద్యోగాలు ఇస్తేనే... తెలంగాణ ఏర్పాటుకు సార్థకత, అర్థం, పరమార్థం ఉంటుందన్న ఆలోచనతో ప్రజాప్రభుత్వం ముందుకెళ్తోందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. చదువుకున్న ప్రతి బిడ్డకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాలన్నదే తమ అభిమతమని తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి చెందకూడదని ఆశించే వారి పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని కోరారు. యాదాద్రి థర్మల్ పవర్‌ప్లాంట్‌కు చెందిన 112 మంది భూనిర్వాసితులకు జెన్‌కోలో ఉద్యోగాలు ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వారితోపాటు డివిజనల్ అకౌంట్స్ అధికారులుగా ఎంపికైన 51 మందికి మాదాపూర్‌లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో భట్టి నియామకపత్రాలు ఇచ్చారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ భూనిర్వాసితులకు ఉద్యోగాలిస్తామని గత పాలకులు చెప్పినా కార్యరూపం దాల్చలేదని గుర్తు చేశారు. పవర్ ప్లాంట్ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం రేవంత్, తాను సమష్టిగా ఆలోచించి,భూనిర్వాసితులకు ఉద్యోగాలివ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇచ్చిన మాటప్రకారం ఇప్పుడు 112మందికి నియామక పత్రాలు ఇచ్చామన్నారు. ఇదే సందర్భంలో ఆర్థికశాఖలో 51 మంది డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్లకు నియామక పత్రాలు అందజేయడం సంతోషంగా ఉందన్నారు.
ప్రజా ప్రభుత్వ పాలనలో 59,000 మంది నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ నియామక పత్రాలు అందించి, ప్రజలకు ేసవ చేసే అవకాశం కల్పించామన్నారు. ఉద్యోగాలు పొందలేని యువత కోసం రూ.9,000కోట్లతో స్వయం ఉపాధి పథకాలు అందించడానికి రాజీవ్ యువ వికాస పథకాన్ని ప్రారంభించామన్నారు. లబ్ధిదారుల ఎంపిక నుంచి గ్రౌండింగ్ వరకు క్యాలెండర్‌ను ముందుగానే ప్రకటించామని, నిర్ణీత వ్యవధిలో పథకాన్ని అమలుచేస్తామని ప్రకటించారు. ఇటీవల దావో్‌సలో రూ.1.80లక్షలకోట్ల పెట్టుబడులకు సీఎం రేవంత్‌ఎంవోయూ చేసుకున్నారని, రానున్న రోజుల్లో ఆయా సంస్థల ద్వారా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. హైదరాబాద్ విస్తరణలో భాగంగానే ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి పూనుకున్నామన్నారు. అభివృద్ధిలో దేశం, ప్రపంచంతో తెలంగాణ పోటీ పడుతోందన్నారు. సంక్షేమ పథకాలు అందిస్తూనే పెట్టుబడి వ్యయం అధికంగా వెచ్చించినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని పేర్కొన్నారు. ‘‘నేను 4 నెలల్లోనే పదవీ విరమణ చేసేవాడిని. మీరు 35 ఏళ్లు సర్వీసులో ఉంటారు. ప్రజలకు సేవలందించేందుకు పునరంకితం కావాలి’’ అని సూచించారు.
ఇవి కూడా చదవండి:
Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌కి మరో దెబ్బ.. అమెరికా వస్తువులపై కూడా 34% సుంకం..
Business Idea: మహిళలకు బెస్ట్..లక్ష పెట్టుబడితో వ్యాపారం, నెలకు రూ.3 లక్షల ఆదాయం..
Loan Charges: ఏప్రిల్‌లో పర్సనల్ లోన్స్‌పై ప్రధాన బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు
Read More Business News and Latest Telugu News