Share News

Bhatti Vikramarka: డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్‌ సరఫరా చేయాలి

ABN , Publish Date - Jul 17 , 2025 | 04:42 AM

రాష్ట్రంలో పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్‌ సరఫరా చేయాలని, భవిష్యత్తులో పెరిగే విద్యుత్‌ డిమాండ్‌ను అధిగమించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క విద్యుత్‌ అధికారులను ఆదేశించారు.

Bhatti Vikramarka: డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్‌ సరఫరా చేయాలి

  • విద్యుత్‌ శాఖ ఉన్నతాధికారుల సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క

హైదరాబాద్‌, జూలై 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్‌ సరఫరా చేయాలని, భవిష్యత్తులో పెరిగే విద్యుత్‌ డిమాండ్‌ను అధిగమించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క విద్యుత్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం విద్యుత్‌ శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో విద్యుత్‌ డిమాండ్‌ 2024 నుంచి 9.8 శాతం చొప్పున పెరుగుతోందని.. 2034 నాటికి అది 33,773 మెగావాట్లకు చేరుకునే అవకాశం ఉందని కేంద్ర సంస్థలు విశ్లేషించినట్టు తెలిపారు. కొత్త సబ్‌ ేస్టషన్లను నిర్మించాలని, వాటి నిర్మాణ ప్రాంతంలో భూమి కోల్పోయిన వారికి ఉద్యోగావకాశాలు కల్పించే విషయంపై దృష్టి సారించాలని సూచించారు. హైదరాబాద్‌లో అండర్‌ గ్రౌండ్‌ ఎలక్ర్టిసిటీ కేబుల్స్‌ నిర్మాణం కోసం పూర్తిస్థాయిలో డీపీఆర్‌ సిద్ధం చేయాలని ఆదేశించారు. విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటుకు స్థలం కొరత ఏర్పడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న 12.5 మిలియన్‌ యూనిట్ల ట్రాన్స్‌ఫార్మర్ల స్థానంలో 16 మిలియన్‌ యూనిట్ల పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. రెన్యూవబుల్‌ ఎనర్జీపై దృష్టి సారించాలన్నారు.


ప్రాజెక్టుల కింద సాగునీటి విడుదలకు వారాబందీ విధానం

హైదరాబాద్‌, జూలై 16(ఆంధ్రజ్యోతి): వానాకాలంలో సాగునీటి ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు నీటి విడుదలలో వారాబందీ(ఒక్కో తూములకు నిర్దిష్ట రోజులకు నీటిని విడుదల చేయడం) విధానం అమలు చేయాలని నీటిపారుదల శాఖ నిర్ణయించింది. రానున్న 15 రోజుల పాటు కచ్చితంగా ఈ విధానం అమలు చేయాలని నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ(జనరల్‌) మహ్మద్‌ అంజద్‌ హుస్సేన్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 11వ తేదీన రాష్ట్ర స్థాయి సమగ్ర నీటి ప్రణాళిక, యాజమాన్య కమిటీ సమావేశమై కృష్ణా, గోదావరి బేసిన్‌లోని జలాశయాల్లో నీటి నిల్వలు, వస్తున్న ప్రవాహాలను సమీక్షించి ప్రస్తుత వానాకాలంలో భారీ, మధ్య తరహా ప్రాజెక్టులతో పాటు చెరువులు, చిన్న ఎత్తిపోతల పథకాల కింద మొత్తం 38,76,849 ఎకరాల ఆయకట్టుకు, 339.11 టీఎంసీల జలాలను సరఫరా చేయాలని నిర్ణయం తీసుకుంది. ఎగువ గోదావరి పరీవాహకంలోని శ్రీరామ్‌సాగర్‌, నిజాంసాగర్‌, కడెం, సింగూరు, ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, అప్పర్‌, లోయర్‌మానేరు తదితర జలాశయాలకు ఇంకా ఆశించిన రీతిలో వరదలు ప్రారంభం కాలేదు. దాంతో ఆయా ప్రాజెక్టుల్లో ఉన్న నీటి నిల్వల ఆధారంగా వాటి కింద ఉన్న ఆయకట్టుకు ప్రస్తుతం పాక్షికంగానే సాగునీటి సరఫరా చేయాలని స్కివమ్‌ కమిటీ నిర్ణయం తీసుకుంది.


ఇవి కూడా చదవండి

కాళేశ్వరం అవినీతి ఇంజినీర్లకు ఇక చుక్కలే..ఈడీ విచారణకు సిద్ధం..


యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 17 , 2025 | 04:42 AM