Share News

JEE Advanced: సంచలనం సృష్టించిన భాష్యం విద్యార్థులు

ABN , Publish Date - Jun 03 , 2025 | 06:00 AM

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2024 ఫలితాల్లో భాష్యం ఐఐటీ జేఈఈ అకాడమీ విద్యార్థులు అద్భుత విజయాలు సాధించారు. ఓపెన్‌ కేటగిరీలో ఎస్‌.వెంకటసాయి చక్రి 33వ ర్యాంకుతో మెరిశాడు. అలాగే శ్రీకర గణేష్‌ (104), ఆకాష్‌ (108), విక్రమ్‌ లెవీ (146), జస్వంత్‌ బాలాజీ (151), సాయిమనోజ్ఞ (152) ర్యాంకులు సాధించి జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు.

JEE Advanced: సంచలనం సృష్టించిన భాష్యం విద్యార్థులు

గుంటూరు(విద్య), జూన్‌ 2(ఆంధ్రజ్యోతి): జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో భాష్యం ఐఐటీ జేఈఈ అకాడమీ విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులతో సంచలనం సృష్టించారని భాష్యం విద్యా సంస్థల చైర్మన్‌ భాష్యం రామకృష్ణ తెలిపారు. ఓపెన్‌ కేటగీరిలో ఎస్‌.వెంకటసాయి చక్రి 33వ ర్యాంకు సాధంచగా, ఎం.శ్రీకర గణేష్‌ 104, ఎన్‌.ఆకాష్‌ 108, టి.విక్రమ్‌ లెవీ 146, డి.జస్వంత్‌ బాలాజీ 151, జి.సాయిమనోజ్ఞ 152వ ర్యాంకులు సాధించి జాతీయ స్థాయిలో విజయకేతనం ఎగురవేశారన్నారు. 100లోపు 14ర్యాంకులు, 200లోపు 26 ర్యాంకులు, 500లోపు 57 ర్యాంకులను తమ విద్యార్థులు కైవసం చేసుకున్నారని వెల్లడించారు. ఉన్నత చదువుల నిమిత్తం ఎస్‌.వెంకటసాయిచక్రి, జి.సాయిమనోజ్ఞకు రూ.5లక్షల చొప్పన, శ్రీకర గణేష్‌, ఎన్‌.ఆకాశ్‌కు రూ.2 లక్షల చొప్పున, టి.విక్రమ్‌ లెవీ, డి.జస్వంత్‌ బాలాజీలకు రూ.లక్ష చొప్పున అందజేసినట్టు తెలిపారు.


ఇవీ చదవండి:

కేంద్రం హెచ్చరిక.. వెనక్కు తగ్గిన రైడ్ హెయిలింగ్ యాప్స్

పాక్‌కు గూఢచర్యం.. భారత యుద్ధ నౌకల వివరాలను చేరవేసిన ఇంజినీర్

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 03 , 2025 | 06:00 AM