Photo Exhibition: గతకాలపు జ్ఞాపకాలు
ABN , Publish Date - Apr 27 , 2025 | 03:48 AM
హైదరాబాద్‌లో నిర్వహించిన భారత్ సదస్సు-2025 లో గతకాలపు జ్ఞాపకాలను తెలుపుతూ ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది.
హైదరాబాద్‌లో నిర్వహించిన భారత్ సదస్సు-2025 లో గతకాలపు జ్ఞాపకాలను తెలుపుతూ ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఫొటో ఎగ్జిబిషన్ కోసం ప్రత్యేకంగా కొన్ని పెద్ద పెద్ద స్టాండింగ్ బోర్డులను ఏర్పాటు చేశారు. వాటిపై మహాత్మాగాంధీ, సుభా్‌షచంద్రబోస్, జవహర్‌లాల్ నెహ్రూ, రాజగోపాలాచారి, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్, ఇందిరాగాంధీ, అంబేడ్కర్ తదితరుల ఫొటోలను ప్రదర్శించారు. కాగా 1962 సెప్టెంబర్ 22న అప్పటి ప్రధాని నెహ్రుతో పాటు ఇందిరా గాంధీ.. ఫ్రెంచ్ దేశ అధ్యక్షుడు జనరల్ డీ గౌల్‌తో ప్యారి్‌సలోని ఎల్సీ ప్యాలెస్ ప్రవేశద్వారం వద్ద మాట్లాడుతున్న ఫొటోను కూడా ఏర్పాటు చేయగా.. అది అందరినీ ఆకట్టుకుంది.
ఇవి కూడా చదవండి
Butta Renuka: ఆస్తుల వేలం.. వైసీపీ మాజీ ఎంపీకి బిగ్ షాక్
Human Rights Demad: కాల్పులు నిలిపివేయండి.. బలగాలను వెనక్కి రప్పించండి.. పౌరహక్కుల నేతలు డిమాండ్
Read Latest Telangana News And Telugu News