Share News

కుంభమేళాకు భారత్‌ గౌరవ్‌ టూరిస్ట్‌ రైలు ప్రారంభం

ABN , Publish Date - Jan 21 , 2025 | 05:10 AM

‘మహా కుంభమేళా పుణ్యక్షేత్ర యాత్ర’ పేరుతో భారత్‌ గౌరవ్‌ పర్యాటక రైలును సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి సోమవారం ప్రారంభమైంది. ఈ రైలును యాత్రికుల్లో ఒకరైన తపన్‌ చంద్ర(77) ఇండియన్‌ రైల్వేస్‌ క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌(ఐఆర్‌సీటీసీ) గ్రూప్‌ జనరల్‌ మేనేజర్‌ పి. రాజ్‌ కుమార్‌ సమక్షంలో జెండా ఊపి ప్రారంభించారు.

కుంభమేళాకు భారత్‌ గౌరవ్‌ టూరిస్ట్‌ రైలు ప్రారంభం

  • ఫిబ్రవరి 15న మరో రైలు

హైదరాబాద్‌, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): ‘మహా కుంభమేళా పుణ్యక్షేత్ర యాత్ర’ పేరుతో భారత్‌ గౌరవ్‌ పర్యాటక రైలును సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి సోమవారం ప్రారంభమైంది. ఈ రైలును యాత్రికుల్లో ఒకరైన తపన్‌ చంద్ర(77) ఇండియన్‌ రైల్వేస్‌ క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌(ఐఆర్‌సీటీసీ) గ్రూప్‌ జనరల్‌ మేనేజర్‌ పి. రాజ్‌ కుమార్‌ సమక్షంలో జెండా ఊపి ప్రారంభించారు. ప్రయాణికులు ఈ రైలు ద్వారా వారాణసీ-ప్రయాగ్‌రాజ్‌-అయోధ్యలోని తీర్థ స్థలాలను సందర్శించవచ్చు. కాగా.. ఐఆర్‌సీటీసీ సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి ఫిబ్రవరి 15 నుంచిప్రారంభమయ్యే మరో ‘మహా కుంభమేళా పుణ్యక్షేత్ర యాత్ర’ భారత్‌ గౌరవ్‌ రైలు పర్యాటక ప్యాకేజీని ప్రకటించింది.


ఈ రైలు ప్రయాగ్‌రాజ్‌లోని ప్రసిద్ధ త్రివేణి సంగమం, వారాణసీలోని కాశీ విశ్వనాథ ఆలయం, కాశీ విశాలాక్షి, అన్నపూర్ణా దేవి, అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి, హనుమాన్‌ గరి దేవాలయాలను సందర్శించే అవకాశాన్ని కల్పిస్తుంది. తెలంగాణలో సికింద్రాబాద్‌, కాజీపేట, వరంగల్‌, ఖమ్మం, ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, వైజాగ్‌(పెందుర్తి), విజయనగరం వంటి ముఖ్యమైన స్టేషన్లలో ప్రయాణికులు ఈ రైలు ఎక్కేందుకు/దిగేందుకు సౌకర్యం కల్పించినట్లు అధికారులు తెలిపారు. ఈ యాత్ర మొత్తం 7 రాత్రులు/8 పగళ్లు వ్యవధిలో సాగుతుంది.

Updated Date - Jan 21 , 2025 | 05:10 AM