Share News

Jajula Srinivas Goud: అఖిల పక్షాన్ని వెంటనే ఢిల్లీకి పంపాలి: జాజుల

ABN , Publish Date - Jun 28 , 2025 | 04:43 AM

బీసీలకు విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో 42ురిజర్వేషన్ల సాధనకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం 48 గంటల్లో అఖిలపక్ష బృందాన్ని ఢిల్లీకి పంపాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు..

Jajula Srinivas Goud: అఖిల పక్షాన్ని వెంటనే ఢిల్లీకి పంపాలి: జాజుల

బర్కత్‌పుర, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి): బీసీలకు విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో 42ురిజర్వేషన్ల సాధనకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం 48 గంటల్లో అఖిలపక్ష బృందాన్ని ఢిల్లీకి పంపాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివా్‌సగౌడ్‌ డిమాండ్‌ చేశారు. తమిళనాడు మాజీ సీఎం జయలలిత లాగానే సీఎం రేవంత్‌ కూడా ఢిల్లీకి వెళ్లి బీసీ రిజర్వేషన్లను సాధించుకున్న తర్వాతనే తెలంగాణలో అడుగుపెట్టాలన్నారు.


శుక్రవారం బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో బీసీ సంఘాల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన జాజుల శ్రీనివా్‌సగౌడ్‌ మాట్లాడుతూ.. జూలై 21నుంచి జరిగే పార్లమెంటు సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెట్టి, ఆమోదించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు.

Updated Date - Jun 28 , 2025 | 04:43 AM